అన్ని ప్రైవేటు, అన్
ఎయిడెడ్ పాఠశాలల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టాలి - హైకోర్టులో
ప్రజాహిత వ్యాజ్యం
రాష్ట్రంలోని
అన్ని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో తెలుగు మీడియం ప్రవేశపెట్టేలా
ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా హిత వ్యాజ్యం దాఖలైంది. ఇటీవల హైకోర్టు
ఇచ్చిన తీర్పును పరిగణనలోకి ప్రవేశాలు చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ
స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం
విచారణ జరిపింది. వాదనలు విన్న ధర్మాసనం, పూర్తి వివరాలతో కౌంటర్లు
దాఖలు చేయాలని సమర్పించాలని పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు
నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా
వేసింది.
0 Komentar