జులై నుంచి
స్కూళ్లను దశలవారీగా రీఓపెన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. తొలుత గ్రీన్, ఆరెంజ్
జోన్లలో స్కూళ్లను తెరిపించి అక్కడ ముందుగా 8-12వ తరగతి విద్యార్థులకు క్లాస్లు
ప్రారంభిస్తారని తెలుస్తున్నది. ఈ వారంలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన
రానుందని తెలుస్తోంది. అటు 8వ తరగతి లోపు విద్యార్థులకు క్లాసులు ప్రారంభించడానికి
మరింత సమయం పట్టనుందని సమాచారం. కాగా కేవలం 30% హాజరుతోనే
పాఠశాలలు పనిచేస్తాయని మానవవననుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇటీవల
టీచర్లతో జరిగిన వెబినార్‌లో పేర్కొన్న క్రమంలో ఆ మేరకు అధికారులు కసరత్తు
చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్కూళ్లను తెరించేందుకు అనుసరించాల్సిన
మార్గదర్శకాలను వచ్చేవారంలో కేంద్ర ప్రభుత్వం జారీచేయనుంది. ఇక కాలేజీలు, యూనివర్సిటీల పునఃప్రారంభానికి అవసరమైన భద్రతా పరమైన మార్గదర్శకాలను
యూజీసీ వెల్లడిస్తుందని ఇదే వెబినార్‌లో మంత్రి స్పష్టం చేశారు.
Teaching Learning Materials
students useful
The central govt is preparing for the reopening of schools across the country in July
Subscribe to:
Post Comments (Atom)
0 Komentar