The New Age
Entrepreneurs Women Entrepreneurs details
మహిళా ఉద్యమ్
నిధి స్కీమ్ పథకం వివరాలు
మహిళల స్వయం
ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్’ అనే మరో పథకాన్ని
అందిస్తోంది. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌ఐడీబీఐ ఈ
పథకాన్ని అందిస్తోంది. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. వ్యాపారం చేయాలని
భావించే మహిళలకు 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించే విదంగా రూ.10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. దీని కొరకు బ్యాంకులు అర్హులైన
మహిళలకు ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి.
బ్యూటీ పార్లర్, టైలరింగ్, కంప్యూటరైజర్డ్ డెస్క్‌టాప్ పబ్లిషింగ్, సెలూన్, సైబర్ కేఫ్, క్యాంటీన్, రెస్టారెంటు,
ల్యాండ్రీ, మొబైల్ టీవీ రిపేరింగ్ రిపేరింగ్, ఆటో
అండ్ సర్వీస్ సెంటర్, కేబుల్ టీవీ నెట్‌వర్క్, టైపింగ్ మెషీన్,
అగ్రికల్చర్ ఎక్విప్‌మెంట్ వంటి పలు బిజినెస్‌లను ప్రారంభించొచ్చు. అయితే
చేసే వ్యాపారంలో కచ్చితంగా 51 శాతం వాటా ఉండాలి. రూ.5 లక్షలకు తగ్గకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. రూ.10
లక్షలు దాటకూడదు. బ్యాంకులు సర్వీస్ చార్జీల కింద 1 శాతం
వసూలు చేస్తాయి. కొత్తగా వ్యాపారం చేయాలనే వారికే కాకుండా ఇప్పటికే బిజినెస్
చేస్తున్న మహిళలకు వ్యాపార విస్తరణకు కూడా రుణం తీసుకునే అవకాశం ఉంది.
For details (Official website)
CLICK HERE
For details (Official website)
CLICK HERE
0 Komentar