ఇది మిట్రాన్
యాప్ వెనుక ఉన్న అసలు కథ
మిట్రాన్ యాప్‌కు
సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మిట్రాన్ యాప్ పాకిస్తాన్‌కు
చెందిన టిక్‌టిక్ యాప్ రీప్యాకేజీ వెర్షన్ అని వెల్లడైంది. దీని తామే తయారు
చేసినట్టు పాకిస్తాన్‌కు చెందిన క్యూబాక్సస్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ
వెల్లడించింది. క్యూబాక్సస్ సంస్థ యాప్ సోర్స్ కోడ్‌ను మిట్రాన్ ప్రమోటర్‌కు 34
డాలర్లకు (రూ. 2600) లకు విక్రయించారు. మా సంస్థ సోర్స్
కోడ్‌తో తయారు చేసిన మిట్రాన్ యాప్‌ను భారతీయ యాప్‌గా పేర్కొనడమే అభ్యంతకరమని క్యూబాక్సస్
వ్యవస్థాపకుడు, సీఈవో ఇర్ఫాన్ షేక్ తెలిపారు. క్యూబాక్సస్
గతంలో ఎన్నో ఇతర ఆప్ కోడ్‌లను క్లోన్‌లుగా పనిచేసే బహుళ యాప్‌లను తయారు చేసింది.
మిట్రాన్ యాప్‌లో
పటిష్టమైన గోప్యతా విధానం కూడా లేదని నిపుణులు అంటున్నారు. వినియోగదారులు సైన్ అప్
చేసి ఇందులో వీడియోలు అప్‌లోడ్ చేయొచ్చు. వారి డేటాతో ఏమి జరుగుతుందో తెలియదు
వినియోగదారులకు తెలిసే అవకాశం లేదు. మిట్రాన్ యాప్ భారత్‌కు చెందినది అన్న
భావనతోనే ప్లే స్టోర్‌లో అధిక రేటింగ్ వచ్చిందని భావిస్తున్నారు.
0 Komentar