Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TRAI Recommends 11-Digit Mobile Numbers


ఇక నుండి మొబైల్‌ నంబర్లకు 11 అంకెలు ఉండనున్నాయి..!
- కేంద్రం ముందు TRAI ప్రతిపాదనలు
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) యూనిఫైడ్‌ నంబరింగ్‌ ప్లాన్‌పేరిట మొబైల్‌, ల్యాండ్‌ లైన్‌ నంబర్ల సంఖ్యను మరింత పెంచుకునేందుకు పలు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచింది. మొత్తం 5 ప్రతిపాదనలను ట్రాయ్‌ సిద్ధం చేసింది. వాటిని అమలు చేస్తే ఇక దేశంలో ఇప్పటి వరకు ఉన్న 10 అంకెల మొబైల్‌ నంబర్ల స్థానంలో 11 అంకెలు కలిగిన మొబైల్‌ నంబర్లు వస్తాయి.
ట్రాయ్‌ చేసిన 5 ప్రతిపాదనల వివరాలు..
1. ప్రస్తుతం 10 అంకెలతో ఉన్న మొబైల్‌ నంబర్లను 11 అంకెలకు పెంచాలి. మొబైల్‌ నంబర్లకు ముందు 9 అంకెను కలపడం ద్వారా అవి 11 అవుతాయి.
2. ఇకపై ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్స్‌కు కాల్‌ చేస్తే వాటి నంబర్ల ముందు 0 (సున్నా) ను కలపాలి. అయితే ల్యాండ్‌లైన్‌ నుంచి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్‌ నుంచి ల్యాండ్‌ లైన్‌కు, మొబైల్‌ నుంచి మొబైల్‌కు కాల్స్‌ చేస్తే.. 0ను ఫోన్‌ నంబర్‌ ముందు కలపాల్సిన పనిలేదు.
3.ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌లైన్‌ సర్వీసులకు చెందిన 3, 5, 6 అంకెలతో ప్రారంభమయ్యే వాడని ఫోన్‌ నంబర్లను టెలికాం కంపెనీలు ఇతర కస్టమర్లకు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి.
4.ప్రస్తుతం డేటా కార్డులు, ఇతర డాంగిల్స్‌లో ఇస్తున్న సిమ్‌ కార్డు 10 అంకెల నంబర్లను 13 అంకెలకు పెంచాలి.
5. ఫిక్స్‌డ్‌ ల్యాండ్‌ లైన్‌ నుంచి 0 డయలింగ్‌ సదుపాయాన్ని కల్పించాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags