ఈ నెల 12
నుంచి రైలు సర్వీసులు ప్రారంభించడానికి రైల్వే సిద్ధమైంది. దిల్లీ నుంచి 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయించింది. వీటికి సంబంధించి
మే 11 సాయంత్రం 4 గంటల నుంచి అడ్వాన్స్
బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది. దేశంలోని 15 ముఖ్య
నగరాలకు ఈ రైళ్లను నడపనున్నారు. దిల్లీ నుంచి దిబ్రుగఢ్, అగర్తల,
హౌడా, పట్నా, బిలాస్‌పూర్,
రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్,
బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం,
మద్‌గామ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ముతావి ప్రాంతాలకు రైళ్లు
నడపనున్నారు. అంతేకాదు కన్ఫర్మ్ టికెట్ కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే
రైల్వేస్టేషన్‌లోకి అనుమతిస్తామని.. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరని రైల్వే శాఖ
పేర్కొంది. రైలు బయలుదేరే ముందు స్క్రీనింగ్ చేస్తామని, లక్షణాలు
లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది.
IRCTC: టికెట్లు బుక్ చేయండి తీసుకోండి ఇలా
ముందుగా ఐఆర్‌టీసీ
అధికారిక వెబ్‌సైట్ చేలా యాప్ ఓపెన్ చేయండి. మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో
లాగిన్ కావాలి. Book Your Ticket పైన క్లిక్ చేయాలి. రైల్వే
స్టేషన్, ప్రయాణ తేదీ, ట్రావెల్ క్లాస్
ఎంచుకోవాలి. ఏ తేదీలో ప్రయాణించడానికైనా సరే అనుకుంటే Flexible with Date పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Find trains పైన క్లిక్
చేయాలి. కొత్త పేజీలో రైళ్ల వివరాలు కనిపిస్తాయి. రైలు రూట్, టైమింగ్స్ చెక్ చేసుకొని ఎంచుకోవాలి. check availability &
fare పైన క్లిక్ చేసి ఖాళీ బెర్తులు, ఛార్జీల
వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత Book Now పైన క్లిక్
చేయాలి. వివరాలు ఎంటర్ చేసి బుకింగ్ పూర్తి చేయాలి. బుకింగ్ పూర్తైన తర్వాత మీ
మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది.
LIST OF SEPCIAL TRAINS
0 Komentar