Implementation
of 12 months salary with a 10 days gap period to the CRTs, who are working in
Tribal Welfare Ashrams Schools on contract basis...
సీఆర్టీలకు సెలవు
కాలంలోనూ వేతనాలు- ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి వెల్లడి..
రాష్ట్రవ్యాప్తంగా
ఉన్న గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్
టీచర్ల(సీఆర్టీ)కు సెలవు రోజుల్లో వేతనాలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్టీలకు
ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వేతనాలను చెల్లిస్తున్నామన్నారు. విద్యాసంస్థలకు
చివరి పనిదినమైన ఏప్రిల్ 23వ తేదీ వరకు మాత్రమే సీఆర్టీల పనిదినాలను పరిగణనలోకి
తీసుకోవడం జరిగేదన్నారు. అయితే సెలవు కాలంలోనూ వేతనాలివ్వాలంటూ సీఆర్టీలు చేసిన
విన్నపాన్ని ప్రభుత్వం అంగీకరించిందని, ఇకనుంచి సీఆర్టీలకు వారి
సర్వీసు నిబంధనల ప్రకారంగా పది రోజుల మినహాయించి మిగిలిన మొత్తం కాలానికి వేతనాలను
చెల్లించనున్నామని ఆమె వివరించారు.
0 Komentar