తిరుమల తిరుపతి
దేవస్థానం (TTD) ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్ పేరు మార్పు...
తిరుమల తిరుపతి
దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్ సేవల వెబ్‌సైట్‌ను ప్రభుత్వ అనుబంధ వెబ్‌సైట్‌గా
మార్చారు. ఈ మేరకు టీటీడీ బోర్డు శుక్రవారం కీలక ప్రకటన జారీ చేసింది. తిరుమల
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జితసేవలు, దర్శనం, బస, కల్యాణమండపాలు తదితర ఆన్‌లైన్ సేవలను
బుక్ చేసుకోవడంతోపాటు ఈ-హుండీ, ఈ-డొనేషన్స్ సౌకర్యం
అందుబాటులో ఉన్న https:/ttdsevaonline.com వెబ్‌సైట్‌ను https:/tirupatibalaji.ap.gov.in గా పేరు మార్చనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ap.gov.in అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన వెబ్‌సైట్ అని అర్థం. మార్చిన
పేరు గల వెబ్‌సైట్ నేటి నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు.
0 Komentar