Tulasi / Holy Basil Health Benefits
తులసి
‘తులసి’ ప్రకృతి ప్రసాదించిన గొప్ప దివ్యౌషధం. తులసి ‘మూలికల
రాణి’ అని పిలవబడుతుంది. ఇది అత్యంత ఆరోగ్యకరమైన, పవిత్ర మరియు అద్భుతమైన ఔషధ ఆయుర్వేద మూలిక. భారత దేశంలో చాలా మంది తులసి మొక్కను దైవంగా
భావించి పూజిస్తారు. పురాణాల్లో ఈ మొక్కకు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది.
తులసితో కలుగు ప్రయోజనాలు .. !
>కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు
తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
>ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
>తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే
దగ్గు, జలుబు తగ్గుతాయి.
>జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి,
ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది
తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
>కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో
బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా
జాగ్రత్త వహించండి).
>తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి
ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ
వచ్చే జ్వరం తగ్గుతుంది.
>తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు
నొప్పులు తగ్గుతాయి.
>తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
>తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం
రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు,
రక్తవిరేచనాలు అరికడుతుంది.
>తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి
ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
>నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో
కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా
నిద్రపడుతుంది.
> కాచి చలార్చిన నీళ్లలో తులసి రసాన్ని కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో
తాగితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. అంతేకాదు జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
> తులసి రసంలో తేనె కలుపుకొని తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళు కరిగిపోతాయని
అంటారు.
> అల్లం రసంతో తులసి రసాన్ని కలిపి తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది. పొట్టలో
నులిపురుగులు నశిస్తాయి.
> బెల్లంతో తులసి ఆకులు కలిపి తింటే కామెర్లు తగ్గు ముఖం పడతాయి.
> రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా నియంత్రిస్తుంది.
> కాలేయం శక్తివంతంగా పనిచేయడానికి దోహద పడుతుంది.
> ఎండవల్ల సోకే అలర్జీలు, పొగ, దుమ్ము
నుంచి శరీరానికి కలిగే హానిని అరికడుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.
>తాజా తులసి ఆకులు రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది.
>తులసి ఆకులు నొప్పి నివారించడానికి మరియు ఒత్తిడి సంబంధిత రుగ్మతలు నిరోధించడానికి
సహాయపడుతుంది.
> తాజా పెరుగుతో పాటు తులసి ఆకులను ఉపయోగించడం వల్ల మీ బరువును
తగ్గించుకోవటానికి సహాయపడుతుంది మరియు శరీరం యొక్క శక్తి స్థాయిని పెంచుతుంది.
0 Komentar