సామాన్యశాస్త్రానికి
రెండు వేరు వేరు జవాబు పత్రాలు
10వ తరగతి సామాన్యశాస్త్ర పరీక్షకు
రెండు వేరువేరు బుక్‌లెట్లు అవకాశం ఉన్నది. ఈ విషయమై అధికారులు చర్చించినట్లు
తెలుస్తున్నది. 10వ తరగతిలో సామాన్యశాస్త్రానికి ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరు భౌతిక-రసాయనశాస్త్రాలు,
మరొకరు జీవశాస్త్రం-పర్యావరణ విద్యను బోధిస్తారు. ఈ రెండు వేరు వేరు
పేపర్స్ ను ఒకే ఉపాధ్యాయుడు దిద్దడం కుదరదు. ఇందుకోసం రెండు ఆన్సర్‌షీట్‌లు ఇవ్వనున్నారని
తెలుస్తున్నది. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావలసి ఉన్నది.
0 Komentar