పసుపు – ఉపయోగాలు
మనదేశంలో పసుపు
లేని,
వాడని ఇల్లు ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలోని
హిందువులు తమ నిత్యజీవితంలో ఏ శుభకార్యమైనా పసుపుతోనే ప్రారంభిస్తారు. వంటలకు వాడే
మసాలా దినుసుల్లో పసుపు చాలా ముఖ్యమైనది. భారతదేశంలో దాదాపు ఆరు వేల సంవత్సరాల
నుంచి పసుపును ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటలో ముఖ్యమైన దినుసుగా, వస్త్రాలపై అద్దడానికి
వాడుతున్నారు.
ఎన్నో వ్యాధులకు మందు :
>మొటిమలు: జామ ఆకులు పసుపుతో కలిపి నూరి రాయాలి,
>కఫము: వేడిపాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి . కఫము తగ్గుతుంది .
>రక్త శుద్ధి: ఆహారపదార్ధాలలో పసుపు కొద్దిగా వాడితే రక్తశుద్ధి అవుతుంది
.
>దగ్గు, జలుబు: మరుగుతున్న నీటిలో పసుపు కలిపి ఆవిరి
పట్టాలి,
>నొప్పులు, బెనుకులు: పసుపు, ఉప్పు,
సున్నము కలిపి పట్టువేయాలి .
>డయాబెటిస్: చిన్న గ్లాసు నీళ్ళలో ఒక పసుపు కొమ్ము చేసి రాత్రంతా
నానబెట్టి పొద్దునా లేచాక పసుపు కొమ్ము తేసేసి నీల్లలు ఒక చెంచాతో బాగా కలిపి
పరగడుపున తాగితే చాలు చెక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. ఈ నీళ్లు కొలెస్టిరాల్ ను,
రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పసుపు కలిపిన పాలు తాగటం వలన రక్తంలో
ఉన్న చక్కెరను తగ్గిస్తుంది. దీని వలన షుగర్ అదుపులో ఉంటుందంటున్నారు ఆరోగ్య
నిపుణులు.
>కాలేయ ఆరోగ్యం: పసుపులో ఉండే ఆంటీ ఆక్సైడ్ లు, ఆంటీ
ఇంఫలమథోరి గుణాలు కాలేయ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడుతుంది
>తలతిరుగుడు: పసుపు దుంప ముద్దగా దంచి తలపై రాసుకోవాలి .
>బరువు తగ్గుదల: పసుపులో ఉండే సర్క్యూమిం ఒబేసిటీ ఇంఫలమటిన్ ను తగ్గ్గిస్తుంది
>డిప్రెషన్, ఆంక్సిటీ: డిప్రెషన్ డిసార్డర్స్,
ఆంక్సిటీ ల నుండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది
>అల్జిమార్ వ్యాధి: పసుపులో ఉండే "కర్కుమిన్ " అనే పదార్ధము
మతిమరుపును అరికడుతుంది.
>పసుపులో ఉండే కురుకుమిన్ వలన కీళ్ళనోప్పులు, కండరాల
నోప్పులు తగ్గటమే కాక క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాదుల నుండి కాపాడుతుంది.
ఆయుర్వేద గుణాలు :
>పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి
కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
>సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు
తగ్గుతాయి.
>పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు
పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి.
పుళ్లు మానుతాయి.
>వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే
మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన
చర్మవ్యాధులలో దురద, మంట, పోటు
తగ్గుతాయి.
>పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి,
నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే
కంటి జబ్బులు తగ్గుతాయి.
>వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు-
గాయాలకు, గజ్జి, చిడుము లాంటి
చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
>వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల
నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా
మటుమాయం అవుతుంది.
>మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి
దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
>నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే
ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
>పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా
మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
>పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి
పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి
నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
>దానిమ్మ, బత్తాయి, నిమ్మ
తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే
చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
>పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో
కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత
కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
>రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి,
దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
>చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు,
తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా
రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
>పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి
రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు
తగ్గుతాయి.
>పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి
మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి
మృదువుగా తయారవుతుంది.
>పసుపుతో అవిసే పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు
రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
>వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు
చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
ఉపయోగాలు
>చర్మ
సౌందర్యానికి: పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి
తోడ్పడుతుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో
పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ,
తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే సౌందర్యం
ఇనుమడిస్తుంది. వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు
తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత బాధలు
తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా
పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది. పసుపు
చూర్ణం, వేపాకు చిగుళ్ళు, దిరిసెన
పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి
పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి.
>ప్రథమ
చికిత్స: దెబ్బలు, గాయాలు తగిలినపుడు శరీరం నుంచి రక్త
స్రావాన్ని ఆపుటకు పసుపు దోహదపడుతుంది. యాక్సిడెంట్లు, ఇతర
సంఘటనలతో కొంతమంది మానసిక రుగ్మతలకు గురయినప్పుడు, అలాంటి
సమయాలలో ఒక కప్పు వేడిపాలలో రెండు చెంచాల పసుపు, రెండు
చెంచాల నెయ్యి కలిపి తాగిస్తే చాలావరకు తేరుకుంటారు.
>జీర్ణకోశ
సమస్యలకు: పొట్టలో, జీర్ణాశయంలో గ్యాస్‌ను తగ్గిస్తుంది. హాని
కలిగించే కొన్ని ఆహార పదార్థాల నుంచి జీర్ణాశయాన్ని రక్షిస్తుంది. నీళ్ల
విరేచనాలు/ రక్త విరేచనాలకు ఒక కప్పు పెరుగులో 10 గ్రా. లేదా
2 టీ స్పూన్లు పసుపు చేర్చి తింటే తగ్గిపోవచ్చు.
>మూల
వ్యాధి (పైల్స్) తో బాధపడేవారు పసుపు, ఆవనూనె, ఉల్లిరసం కలిపిన మిశ్రమాన్ని పైల్స్ ఉన్నచోట రాస్తే ఉపశమనం ఉంటుందని మన
పూర్వీకుల నమ్మకం.
>కాలేయం
(లివర్): విషతుల్యమైన పదార్థాల నుంచి కాలేయానికి హాని కలుగకుండా
కాపాడుతుంది. కాలేయంలో తయారయ్యే పిత్తరసం లేదా బైల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఆల్కహాల్
ఎక్కువ తాగేప్పుడు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 5 గ్రా. పసుపును ఒక గ్లాసు నీళ్ళలోగాని, మజ్జిగలోగాని
కలిపి నెలరోజులపాటు తాగితే లివర్‌కు ప్రమాదం లేకుండా ఉంటుంది.
>శ్వాసకోశ
సమస్యలకు: బయటి కాలుష్యం నుంచి, విషతుల్యమైన పదార్థాల
నుంచి శ్వాసకోశాన్ని రక్షిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్
నెయ్యి, 4-5 గ్రా. పసుపు కలిపి తాగితే దగ్గు తగ్గుతుంది.
ఆస్మా నుంచి ఉపశమనం ఉంటుంది. నేతిలో ఒక స్పూన్ పసుపు, కొంచెం
జీలకర్ర, కొంచెం వెల్లులి వేసి వేయించి, వాసన పీల్చి తింటే బ్రాంకైటిస్ వున్నవారికి మందు బాగా పనిచేస్తుంది.
ఇతర ఉపయోగాలు
రక్తంలో చెడు
(ఎల్.డి.ఎల్) కొలెస్టెరాల్ మోతాదును తగ్గించి గుండెజబ్బులు రాకుండా చూస్తుంది. పసుపులో
వుండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, వ్యాధులు
రాకుండా కాపాడుతుంది.
క్యాన్సర్‌ను చంపే పసుపు
పసుపు శరీరంలోని
ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయం, నోరు వగైరా భాగాలలో కాన్సర్ రాకుండా నివారిస్తుంది. పసుపు శరీరంలో
కాన్సర్ దరి చేరలేని పరిస్థితులు కల్పిస్తూ, శరీరంలోని
వివిధ కణాలను కాన్సర్ ఎదుర్కొనేట్లు చేస్తుంది. ఎప్పుడైనా కణితి (ట్యూమర్)
ఏర్పడితే దాన్ని నిర్మూలించేట్లు చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్‌కు గాయాలు నయం
చేయడంతోపాటు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించే శక్తి ఉంది.
పసుపుతో కాలేయానికి రక్ష
కాలేయం పనితీరును
దెబ్బతీసే తీవ్రమైన సిరోసిస్ వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తుంది. పసుపులో ఉండే 'కర్కుమిన్'
అనే పదార్థం కాలేయం కణాల్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. పసుపులో ఉండే
వర్ణకం పిత్త వాహికల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూస్తుంది.
0 Komentar