లాక్‌డౌన్‌లో
పట్టుబడ్డ వాహనాలను తీసుకెళ్లవచ్చు
లాక్‌డౌన్
నిబంధనలను ఉల్లంఘించినందుకు సీజ్ చేసిన వాహనాలను విడుదల చేయాలని పోలీసులను
ముఖ్యమంత్రి మైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో డీజీపీ
గౌతమ్ సవాంగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టుబడ్డ వాహనాలను తిరిగి తీసుకెళ్లొచ్చని
ఆంధ్రప్రదేశ్ డీజీపీ సవాంగ్ అన్నారు. వాహన యజమానులు సంబంధిత పీఎస్‌ను
సంప్రదించాలన్నారు. మళ్లీ నియమాలను ఉల్లఘించబోమంటూ వాహనదారుల నుంచి హామీపత్రాన్ని
తీసుకోవాలని చెప్పారు. జరిమానా రూ. 100కు పరిమితం చేయాలని
స్పష్టం చేశారు. యజమానులకు వాహనాలు అప్పగించేటప్పుడు కోవిడ్-19 నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. వాహనాలకు సంబంధించిన సరైన
ధ్రువపత్రాలను యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్లో సమర్పించేలా చర్యలు తీసుకోవాలని
ఆ ప్రకటనలో జిల్లా ఎస్పీలకు ఆదేశించారు. ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లో మినహా
రాష్ట్రంలో సొంత వాహనాలపై తిరిగేందుకు ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వాహనాలకు అనుమతి
ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ
చేశామని డీజీపీ సవాంగ్ పేర్కొన్నారు.
0 Komentar