11 ఏళ్ల
కనిష్టానికి భారత GDP
కరోనా వైరస్ ప్రభావంతో
భారత వృద్ధిరేటు భారీగా పడిపోగా GDP 11 ఏళ్ల కనిష్టానికి చేరింది. చివరి
త్రైమాసికంలో భారత్ 3.1% వృద్ధిరేటును నమోదుచేసింది.
అసలు జీడీపీ అంటే
ఏమిటి .. ?
స్థూల దేశీయోత్పత్తి
(జీడీపీ): వినియోగదారులు లేదా డిమాండ్ వైపు నుంచి ఆర్థిక వ్యవస్థ పనితీరును
చూపిస్తుంది. దేశంలో వార్షికంగా లేదా
త్రైమాసిక పరంగా జరిగే (పూర్తి స్థాయిలో) మొత్తం వస్తువులు, సేవల ఉత్పత్తి విలువ ఇది. జీడీపీని
ఫ్యాకర్ కాస్ట్‌లో అలాగే మార్కెట్ ప్రైస్‌లో చూస్తారు. జీడీపీ ఫ్యాక్టర్ కాస్ట్
అంటే జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అన్నమాటే.
మార్కెట్ ప్రైస్ అంటే ఇక్కడ ప్రభుత్వ పన్నులు, సబ్సిడీలు
కూడా గమనంలోకి వస్తాయి. జీడీపీలో కూడా నామినల్ – రియల్ అని
2 రకాలు. ద్రవ్యోల్బణం లెక్కలతో పనిలేకుండా, ప్రస్తుత ధరలను
పరిగణనలోకి తీసుకుని లెక్కిం చే ది నామినల్ జీడీపీ. అయితే, ఒక
బేస్ సంవత్సరం గా ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని లెక్కించేదే రియల్ జీడీపీ.
0 Komentar