కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు
లాక్ డౌన్ తరువాత కూడా ఇంటి నుంచే పని
కేంద్ర ప్రభుత్వం
లాక్ డౌన్ ముగిసిన తర్వాత కూడా ఉద్యోగులను ఇంటి దగ్గర నుంచే పనిచేయించడానికి
సిద్ధమవుతోంది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా మార్గదర్శకాలను
కేంద్రం గురువారం విడుదల చేసింది. ఈ ముసాయిదాను అభిప్రాయాల కోసం అన్ని విభాగాలకు
పంపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని 75% ప్రభుత్వ శాఖల్లో పనులను
ఈ-ఆఫీస్, వీడియో కాన్ఫరెన్ల ద్వారా చేస్తున్నాయి. పరిస్థితులన్నీ
చక్కబడ్డ తరువాత కూడా అర్హులైన అధికారులు/ఉద్యోగులు నిబంధనలను అనుసరిస్తూ ఏడాదిలో 15 రోజుల పాటు వర్క్ ఫ్రంహోం చేయవచ్చని తెలిపింది. మార్గదర్శకాలకు సంబంధించి
తమ స్పందనలను అన్ని శాఖలు 21లోగా పంపించాలని కోరింది.
0 Komentar