Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Zones wise Lockdown exemptions and Restrictions

జోన్ల వారిగా లాక్ డౌన్ మినహాయింపులు, ఆంక్షలు 
మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరో 2 వారాలు కొనసాగించేందుకు కేంద్రం నిర్ణయించింది. వారం ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా ఎప్పటికప్పుడు జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్‌లుగా వర్గీకరిస్తున్నామని, తదనుగుణంగా నిబంధనల అమలు ఉంటుందని పేర్కొంది. క్షేత్ర స్థాయి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఆంక్షలను విధించుకోవచ్చని పేర్కొంది. రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్ల వారీగా కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని తెలిపింది. కేంద్ర హోం శాఖ అనుమతించిన కొన్ని అవసరాలకు మాత్రం విమానం, రైలు, రోడ్డు ప్రయాణాలను అనుమతిస్తారని పేర్కొంది. అంతర్రాష్ట్ర సరుకు రవాణాను అనుమతించాలని రాష్ట్రాలను కోరింది. ఖాళీ ట్రక్కులను అనుమతించాలంది. 
అయితే తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ యథాతథంగా కొన సాగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 5న ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశమై ఈ అంశాలపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
జోన్లకు అతీతంగా.. ముఖ్య సడలింపులు.. ఆంక్షలు
దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీస్‌లు రద్దు. వైద్య, రక్షణ రంగాలకు మినహాయింపు.
కేంద్రం అనుమతించిన వారు తప్ప మిగిలిన వారికి రైళ్లలోప్రయాణం నిషేధం.
కేంద్రం అనుమతించిన బస్సులు మినహా అన్ని అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతి లేదు
మెట్రో రైల్‌ సర్వీసులు
అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణాలు (ఇండివిడ్యుయల్‌) నిషేధం. మెడికల్‌ లేదా కేంద్రం అనుమతించిన వారికి మాత్రమే అవకాశం
అన్ని పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సంబంధిత సంస్థలన్నీ మూసివేత
అన్ని సినిమా హాళ్లు, షాపింగ్‌ మాళ్లు, జిమ్, బార్లు, సమావేశ మందిరాల మూసివేత
సామాజిక, రాజకీయ, క్రీడా సంబంధ కార్యక్రమాలు నిషేధం
అన్ని రకాల మత కార్యక్రమాల రద్దు.
రెడ్‌ జోన్‌లో..
సైకిల్‌ రిక్షాలు, ఆటో రిక్షాలు నడపొద్దు
టాక్సీలు, క్యాబ్‌లు తిరగొద్దు
జిల్లాలోపలగానీ, జిల్లా బయటకుగానీ బస్సులు తిరగకూడదు
సెలూన్లు, స్పాలు మూసేయాలి.
కార్లు కేవలం ఇద్దరు వ్యక్తులతో తిరగొచ్చు, బైక్‌ పై ఒక్కరే ప్రయాణించాలి.
పరిశ్రమల్లో అత్యవసర సరుకులను ఉత్పత్తి చేసేవి, మెడికల్‌ ఉత్పత్తులు, ఐటీ హార్డ్‌ వేర్‌ రంగం, సరైన భౌతిక దూరం పాటిస్తూ జూట్‌ మిల్లుల నిర్వహణ వంటి వాటికి అనుమతి ఉంది. పల్లె ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు వర్తిస్తాయి.
బయటి నుంచి కూలీలను తీసుకురాకుండా ఉన్న వారితో  పట్టణాల్లో భవన నిర్మాణ పనులు, రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణాలు కొనసాగుతాయి
మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలోని అన్ని మాల్స్‌ మూసివేత. కానీ అత్యవసర సరుకులను అమ్మవచ్చు.
ఒకే ఒక వ్యక్తి నడిపే షాపులు, కాలనీల్లోని షాపులు ఏ నిబంధనలు లేకుండా తెరుచుకోవచ్చు. వీటి వద్ద భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది.
అత్యవసర వస్తువులకు మాత్రమే ఈ కామర్స్‌ సంస్థలకు అనుమతి ఉంది.
33శాతం సిబ్బందితో ప్రైవేటు ఆఫీసుల నిర్వహించుకోవచ్చు.
డిప్యూటీ సెక్రటరీ లెవల్‌ ప్రభుత్వ ఆఫీసులు 100 శాతం సిబ్బందితో పని చేయవచ్చు. మిగిలిన ప్రభుత్వ ఆఫీసులన్నీ కేవలం 33 శాతం సిబ్బందితో పనిచేయవచ్చు.
ఆరెంజ్‌ జోన్‌లలో
జిల్లాల లోపల, జిల్లాల బయటకు బస్సుల ప్రయాణాలపై నిషేధం
ఒక డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులతో క్యాబ్‌లను అనుమతిస్తారు.
జిల్లాల్లో వాహనాలు తిరిగేందుకు (ఎంపిక చేసిన వాటికి మాత్రమే) అనుమతిస్తారు
గ్రీన్‌ జోన్‌లలో..
జోన్లకు అతీతంగా కేంద్రం విధించిన నియమాలు తప్ప మిగతా వాటికి అనుమతి ఉంటుంది.
50 శాతం సీట్ల సామర్థ్యంతో బస్సులు ప్రయాణించవచ్చు.
బస్సు డిపోలు 50శాతం మందితో నడుపుకోవచ్చు.
మద్యం, పాన్, సిగరెట్‌ విక్రయాలకు షరతులతో అనుమతి.
Previous
Next Post »
0 Komentar

Google Tags