షెడ్యూల్
ప్రకారమే '10వతరగతి' పరీక్షలు
-రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
రాష్ట్రంలో పదో
తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ తేదీ నుంచి 17 వరకూ జరుగుతాయని రాష్ట్ర
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. సమగ్ర శిక్షా రాష్ట్ర
కార్యాలయంలో సోమవారం విద్యాశాఖ మంత్రి పదవ తరగతి పరీక్షలపై అన్ని జిల్లాల
విద్యాశాఖ ఉన్నతాధికారులు, జాయింట్ కలెక్టర్, పేరెంట్స్ కమిటీ, మండల విద్యాశాఖాధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో
వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. మంత్రి
మాట్లాడుతూ పరీక్షల సంసిద్ధతకు పిల్లల్లో మానసిక స్తైర్యం, ధైర్యం
నింపాలని, కోవిడ్ - 19 కారణంగా అన్ని
జాగ్రత్తలతో పరీక్షల నిర్వహణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ..
>పరీక్ష
కేంద్రాల్లో శానిటైజర్ వినియోగం, థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు
భౌతికదూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
>ప్రతి గదికీ 10
నుంచి 12 మంది విద్యార్థులకు మించకుండా ఉండేలా చూడాలి.
>రెడ్ జోన్లు, కంటైన్మెంట్ జోన్ల నుంచి వచ్చే
విద్యార్థుల విషయంలో రవాణా సౌకర్యంతో పాటు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
0 Komentar