ఏపీలో 30
స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలు
నైపుణ్యాభివృద్ధి
కేంద్రాలు, కంపెనీల మధ్య నిరంతరం సంబంధాలు ఉండాలని ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. సంబంధిత రంగంలో టెక్నాలజీ పరంగా వస్తున్న
మార్పులు, చేర్పులను పరిగణలోకి తీసుకుని ఆ మేరకు శిక్షణ
ఇచ్చి నైపుణ్యాన్ని మెరుగుపరచాలన్నారు. కాలేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఐటీఐ,
పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదివిన
విద్యార్థుల వివరాలపై సర్వే చేయాలని సీఎం జగన్ సూచించారు. తర్వాత పరిశ్రమల
అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు.
ఈలోగా పరిశ్రమలకు అవసరాలు ఏంటో తెలుసుకోవాలని కూడా జగన్ సూచించారు. సింగపూర్,
జర్మనీ, అమెరికా, యూకే
దేశాల్లోని పలు యూనివర్సిటీలు, సంస్థలు మనతో కలిసి పని
చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల వాటిని ఇందులో భాగస్వాములను చేయాలి. ఐటీఐ,
పాలిటెక్నిక్ చేసిన వారికి మేలు జరిగేలా ఎన్‌ఏసీ (నేషనల్ అకాడమీ
ఆఫ్ కన్‌స్ట్రక్షన్)ని కూడా భాగస్వామిని చేయాలి.
30
కాలేజీల్లో 20 రంగాలకు చెందిన అంశాలపై నైపుణ్యాభివృద్ధి బోధన
జరగాలని సీఎం సూచించారు. దాదాపు 120 కోర్సుల్లో బోధన, నైపుణ్యాభి వృద్ధిలో శిక్షణ
ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. స్థానిక పరిశ్రమలు, భారీ
పరి శ్రమలు, అంతర్జాతీయ పరిశ్రమలకు అవసర మైన నైపుణ్యాలను
అభివృద్ధి చేస్తారు. కోర్సుల్లో కియా, ఐటీసీ, టెక్ మహీంద్ర, హెచ్‌సీఎల్, హ్యుందాయ్,
వోల్వో, బాష్ వంటి కంపెనీల భాగస్వామ్యం
ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ, ఐఐఐటీ
బోధనా సిబ్బందితో అడ్వాన్స్‌డ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తారు. 30 కాలేజీల నిర్మాణానికి రూ.1210 కోట్లకు పైగా ఖర్చు
అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది.
0 Komentar