Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

3,795 VRO posts replaced by promotions


3,795 వీఆర్వో పోస్టులు పదోన్నతి ద్వారా భర్తీ
రాష్ట్రంలో ఎన్నో ఏళ్ల నుంచి గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఎ)గా పనిచేస్తున్న అర్హులకు ఒకే పర్యాయం (వన్‌టైమ్) ప్రాతిపదికన 3,795 మందిని గ్రేడ్ – 2 వీఆర్వోలుగా పదోన్నతికి లైన్ క్లియర్ అయింది. తక్షణమేఖాళీలను ప్రకటించి సీనియాప్రాతిపదికన అర్హులైన వీఆర్ఎలను వీఆర్వోలు గా ఎంపిక చేయాలని రెవెన్యూ శాఖ కార్యదర్శి వి.ఉషారాణి రాష్ట్ర భూపరికమిషనర్ ద్వారా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు
>కచ్చితంగా ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.
>ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి వీఆర్ఎలుగా ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక చేయాలి.
>ఇంటర్మీడియట్ చదవకుండా నేరుగా డిగ్రీ, పీజీ చేసిన వారు కూడా అర్హులే.
>ఉద్యోగంలో చేరిన తర్వాత ఎవరైనా కోర్సు చేసి ఉంటే అందుకు ముందస్తు అనుమతి తీసుకున్నారో లేదో పరిశీలించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఎక్కడా ఇలా నిర్దిష్ట విధానం లేనందున ఈనిబంధనను మినహాయించి సర్టిఫికెట్లు  సరయినవో కావో కచ్చితంగా నిర్ధారించాలి.
>అర్హులైన వీఆర్ఏలను వీఆర్వోలుగా ఎంపిక చేసేందుకు ఒకే పర్యాయం (వన్‌టైమ్) ప్రాతిపదికన అనుమతించింది. ఈ మేరకు సర్వీసు నిబంధనలను ఒకే పర్యాయానికి అనే షరతుతో మినహాయింపు ఇచ్చింది.

Previous
Next Post »

1 comment

Google Tags