శానిటైజర్లతో మనం వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు
నష్టాలు కూడా ఉన్నాయి...
ప్రస్తుతం దేశంలో
కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో అందరూ శానిటైజర్‌ను ఎక్కువగా వాడటం మొదలు పెట్టారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు ముందెన్నడూ
లేని విధంగా శానిటైజర్లకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. అయితే శానిటైజర్లను మనం
వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.
>అధిక
మోతాదులో శానిటైజర్ వాడటం వల్ల మన అరచేతుల్లోని మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ
మంచి బ్యాక్టీరియా మన చర్మాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతో
ఉపయోగపడుతుంది.
>అంతేకాకుండా తరచుగా శానిటైజర్ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. శానిటైజర్‌కు అలవాటుపడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది.
>అంతేకాకుండా తరచుగా శానిటైజర్ వాడుతున్నట్లయితే చేతుల్లో ఉండే చెడు బ్యాక్టీరియా శక్తివంతంగా తయారవుతుంది. శానిటైజర్‌కు అలవాటుపడి, నిరోధక శక్తిని పెంచుకుంటుంది.
>పిల్లలు మీ
చుట్టు ప్రక్కల ఉన్నపుడు శానిటైజర్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వారు గనుక
శానిటైజర్‌ను శరీరంలోకి తీసుకున్నట్లయితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
క్రింది
సందర్భాలలో శానిటైజర్ వాడకుండా ఉండటం ఉత్తమం
>సబ్బు, నీరు
అందుబాటులో ఉన్నప్పుడు కచ్చితంగా శానిటైజర్ వాడకానికి దూరంగా ఉండండి. ఓ 20 సెకన్ల పాటు సబ్బు నీళ్లతో చేతుల్ని కడుక్కోవటం ద్వారా క్రిముల్ని
తరిమికొట్టవచ్చు.
>మీ చేతులకు
విపరీతంగా దుమ్ము, ధూళీ అంటుకున్నప్పుడు కూడా శానిటైజర్‌ను
ఉపయోగించకండి. అవి క్రిముల్ని చంపడంలోనూ విఫలమవుతాయి.
>చుట్టుప్రక్కల
ఉన్న వారు తుమ్మినా, దగ్గినా కొంతమంది వెంటనే శానిటైజర్
రాసుకుంటుంటారు. ఇలా చేయటం వల్ల ఏ లాభమూ ఉండదు. గాల్లోని క్రిములను శానిటైజర్
చంపలేదని గుర్తించాలి. అదో భయానికి గురై తరచూ దాన్ని వాడటాన్ని తగ్గించుకోవాలి.
>శానిటైజర్
వాడిన తర్వాత వంట చేయడానికి లేదా ఫైర్ దగ్గరికి వెళ్లికపోవడమే మంచిది. ఎందుకంటే
చాలా శానిటైజర్లలో అధికా శాతం స్పిరిట్, ఆల్కాహాల్‌ని
వాడుతున్నారు. అందులోనూ స్పిరిట్ చాలా డేంజర్. దానికి మండే గుణం ఉంది.
0 Komentar