Aloe vera health benefits and side effects in Telugu
కలబంద
కలబంద
కలబందను ఆయుర్వేద
వైద్యంలో,
బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో
ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నవారు మితంగా కలబంద వాడితే లాభమే. అయితే
అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మాత్రం నిపుణుల సలహా మేరకే వాడాలి...
కలబంద (ఆలోవీర)
తో లాభాలు
>జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని
తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు
అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
>కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి
ప్రయోజనం చేకూరుతుంది.
>కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ
వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే
పోయి శరీర కాంతి పెరుగుతుంది.
>కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది మరియు పంటి మీద చేరే కల్మషం
తగ్గిస్తుంది.
>తాజా కలబంద గుజ్జు కీళ్ళ నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది.
>కలబంద గుజ్జును చెక్కెరతో కలిపి సేవించడము గాని, రసాన్ని
తీసి కలకండతో సేవించిన గాని శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని
పొందవచ్చు.
>కలబంద గుజ్జును ఉడికించి వాపులు, గడ్డల పై కడితే
తగ్గి పోతాయి.
>కాలిన పుండ్లపై కలబంద ఆకులను వేడిచేసి రసమును పిండిన బాధ తగ్గటమే కాక త్వరగా
మానిపోతాయి.
>రోజు ఉదయం సాయంత్రం 1 1/2 అంగుళాల కలబంద ముక్కను
భుజించిన చిరకాలంగా నున్న మలబద్దకము తగ్గిపోతుంది.
>కలబంద రసాన్ని లేపనము చేసిన అన్ని రకములయిన చర్మ వ్యాధులు, సూర్య తాపము వలన, X-RAY వలన ఏర్పడు చర్మ రోగాములు
తగ్గిపోతాయి.
>దగ్గు నివారణకై 1 స్పూన్, మిరియాలు
1/4 స్పూన్, శొంటి 1/4 స్పూన్, తేనెలో కలిపి సేవించాలి.
>కడుపు నొప్పి లోను, కడుపులో గ్యాస్ ఏర్పడినపుడు,
గోధుమ పిండి, కలబంద గుజ్జు పై వాము, సైంధవ లవణము, జీలకర్ర కలిపి చపాతీలు చేసుకుని
భుజించాలి.
>అర్శ మొలల యందు 10 నుండి 30
గ్రాముల కలబంద రసం తాగిస్తూ, కలబంద గుజ్జు పసుపు కలిపి
అర్శమొలల పై లేపనము చేయాలి.
>కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందనపు పొడి కలుపుకుని ముఖంపైనున్న
మొటిమలకు పూస్తే మొటిమలు తగ్గిపోతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
>కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె తో ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల వద్ద నల్లగా ఉన్న ప్రాంతాలలో పూసి, కాసేపటి తర్వాత చల్లటి నీటితో
కడిగేయండి.
కొన్ని జాగ్రత్తలు
>కలబందలో ఉండే
లేటెక్స్ వల్ల కిడ్నీ సమస్యలు, కడుపునొప్పి, పొటాషియం
లెవెల్స్ పడిపోవడం వంటి
సైడ్ఎఫెక్ట్స్ కలుగుతాయి.
>అదేపనిగా రోజూ
కలబంద గుజ్జు వాడితే స్కిన్ అలర్జీ,
వాపు, దద్దుర్లు , కనురెప్పలు ఎర్రబడడం, చర్మం పొడిబారడం, గట్టిపడటం, ఊదా రంగు మచ్చలు ఏర్పడటం, చర్మం పగలడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
>అలోవెరా
రక్తంలో షుగర్ లెవెల్స్ ను ఒక్కసారిగా తగ్గించేస్తుంది. అందుకే
షుగర్ ఉన్నవారు కలబందను జాగ్రత్తగా వాడాలి.
>కలబంద జ్యూస్ అతిగా
తాగితే లివర్ ఇన్ఫ్లమేషన్కు
దారితీస్తుంది.
>అధిక
మొత్తంలో కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల విరేచనాలు, అతిసారం మరియు
తీవ్రమైన కడుపు నొప్పి కలిగి , ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్కు
దారితీస్తుంది.
>పేగు సంబంధిత
వ్యాధులతో బాధపడుతున్నవారు కలబంద కారణంగా మరింత ఇబ్బంది పడతారు.
>కడుపులో
హెమరాయిడ్స్ ఉన్నవారు కలబంద జోలికే వెళ్లొద్దు.
>కలబంద రసం తాగడం వల్ల
గుండె సంబంధిత వ్యాధులను అధికం చేసే ‘అడ్రినలిన్’ హార్మోన్
ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. పొటాషియం లెవెల్స్ తగ్గడంతో హార్ట్బీట్
దెబ్బతింటుంది.
0 Komentar