ఏపీలో NRC, NPR చేపట్టేది లేదు.. అసెంబ్లీలో తీర్మానం
రాష్ట్రంలో ఎట్టి
పరిస్థితుల్లోనూ ఎన్‌ఆర్‌సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్)ని అమలు చేయబోమని
ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే విధంగా ఈ అంశానికి సంబంధించి గతంలో ప్రకటించిన
విధానానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌కు
సంబంధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బుధవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
భోజన విరామం
తర్వాత సభలో ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా ప్రవేశపెట్టారు. ఈ
బిల్లును మూజువాణి ఓటుతో స్పీకర్ ఆమోదం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010
నాటి ఫార్మట్ ప్రకారమే ఎన్‌పీఆర్ అమలు చేయాలని, ఆ మేరకు ఎన్‌పీఆర్–2020లో
మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరారు.
0 Komentar