కంటైన్మెంట్
జోన్లలో 10
వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉండవు: ఏపీ మంత్రి సురేశ్
జులై 10 నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షలపై విద్యా మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో సమీక్ష
నిర్వహించారు. కరోనా దృష్ట్యా అదనంగా 4,154 పరీక్షా
కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వివరించారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద
పూర్తి జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ‘‘ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు” మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటాం. పరీక్షలు నాటికి ఇప్పుడు
గుర్తించిన ప్రాంతాల్లో కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తాం.
ప్రతి
పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం. ఓపెన్ స్కూల్ విద్యార్థులకు 1,022 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తాం. టీచింగ్ స్టాఫ్ కు పరీక్షా
కేంద్రాల్లో గ్లౌజు లు కూడా ఇస్తామన్నారు. ప్రతి కేంద్రం లో ఒక ధర్మల్ స్కానర్
ఉండేవిధంగా దాదాపు 4500 స్కానర్ లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. “కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా
కేంద్రాలు ఉండవు’’ అని
మంత్రి సురేశ్ పేర్కొన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల కోసం 8లక్షల మాస్కులు అందుబాటులో ఉంచినట్లు మంత్రి
చెప్పారు.
పరీక్షలు జరిగినన్ని
రోజులు వారు వసతి గృహాల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత వరకు
ఎక్కడి వారు అక్కడే పరీక్షలు రాసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సురేశ్
వెల్లడించారు.
0 Komentar