AP Government cancelled 10th class & Inter supply Examinations
AP లో 10వ తరగతి పరీక్షలు & ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు రద్దు
10వ తరగతి మరియు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటర్ ఫెయిల్ అయిన ఇంటర్
విద్యార్థులను పాస్ చేస్తున్నట్లు ఆదిమూలపు వెల్లడించారు. పరీక్షల నిర్వహణకు
ఏర్పాట్లు చేసినప్పటికీ, పరీక్షలు
నిర్వహిస్తే మరిన్ని ఇబ్బందులు పెరుగుతాయని పరీక్షలు రద్దు చేస్తున్నట్లు మంత్రి
ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని
నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. కరోనా తీవ్రత దృష్ట్యా పరీక్షలు రద్దు
చేశామన్నారు. సప్లిమెంటరీ ఫీజు ఇచ్చిన
వారికి వెనక్కి ఇచ్చేస్తామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే రీ వెరిఫికేషన్,
రీ కౌంటింగ్ యథాతథంగా జరుగుతాయని.. విద్యార్థులు ఆ అవకాశాన్ని
వినియోగించుకోవచ్చునని అన్నారు.
విద్యార్థులకు ఇచ్చే గ్రేడింగ్ విధివిధానాలను త్వరలో
ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఈ విషయమై శుక్రవారం పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, జిల్లా విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ
సందర్భంగా ఫార్మేటివ్ అసెస్మెంట్- 1
& 2 సమ్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షల్లో విద్యార్థులు సాధించిన
ప్రగతి ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించవలెనని ఒక అభిప్రాయానికి వచ్చారు. ఇప్పటికే
వీటికి సంభందించిన మార్కులను cse వెబ్ సైట్ నందు అన్ని
పాఠశాలల వివరాలు అప్లోడ్ చేయడం జరిగింది. ఐతే ఈ విధానం వలన ప్రభుత్వ యాజమాన్యాల
పరిధిలోని పాఠశాలలకు నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఐతే ఇప్పటికిప్పుడు ప్రీ
ఫైనల్ మార్కులను ఆధారంగా గ్రేడులు కేటాయిస్తే cse వెబ్ సైట్
లో అప్లోడ్ చేయనందున కొంత గందరగోళానికి దారితేయవచ్చు. కాబట్టి ప్రీ ఫైనల్ మార్కులను తీసుకొనకపోవచ్చు. ఏదీ ఏమైనా ఈ విషయమై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవలసి ఉన్నది.
ఏ రాష్ట్రంలో లేని విధంగా లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ‘విద్యామృతం’ పేరుతో డిడి
సప్తగిరి లో వీడియో పాఠాలు , ‘విద్యాకలశం’ పేరుతో రేడియో కార్యక్రమాలను
డిజిటల్ తరగతులు నిర్వహించడం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు
వంటి రాష్ట్రాలు 10వ తరగతి పరీక్షలు రద్దు
చేసిన సంగతి తెలిసినదే. మొత్తం 6.3 లక్షల మంది పదో తరగతి విద్యార్థులను పైతరగతులకు
ప్రమోట్ చేస్తున్నట్టు తెలిపారు.
Super
ReplyDeleteAlready guessed decision.
ReplyDeleteThis decision also implement in telangana plz
ReplyDeleteTelusu ga corona batch ani
ReplyDeleteFa1&2 sa1 markulalo feail ayite
ReplyDeleteBokettukoni bastandlo kurchovali
Delete