రాష్ట్రమంతా భూముల రీసర్వే కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర
వ్యాప్తంగా సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏమాత్రం లోపం
లేనివిధంగా భూముల రీసర్వేకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనుషులకు ఆధార్ ఇచ్చినట్లుగా
ప్రతి ల్యాండ్ బిట్ కు భూధార్ నంబరు కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్
రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం
ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం జీఓ జారీ చేశారు.
ఈ టెక్నాలజీ ద్వారా మొదటి దశ కింద పైలట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జగ్గయ్య పేటలో
రీసర్వే ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో పెట్టిన రూ.200.15 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వాలని సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్
ప్రభుత్వాన్ని కోరారు. దీనిని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు వీలుగా ఈ
కేటాయింపులు జరిగింది. దీనిని పరిశీలించిన ప్రభుత్వం అనుమతించింది.
0 Komentar