ఆదర్శ పాఠశాలల్లో
లాటరీ పద్ధతిలో ప్రవేశాలు
ఇంటర్ మాత్రం పది
మెరిట్ ఆధారంగా సీట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని
ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 2020-21 విద్యాసంవత్సరానికి
సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాల కోసం విద్యార్థులను ఎంపిక చేసేందుకు లాటరీ
విధానాన్ని ప్రభుత్వం అనుసరించనుంది. అలాగే 7, 8, 9 తరగతుల్లో
మిగిలిపోయిన సీట్లను కూడా లాటరీ పద్ధతిని పాటించనుంది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు
మాత్రం విద్యా ర్థులు 10వ తరగతి పరీక్షల్లో సాధించిన మార్కుల
మెరిట్ ఆధారంగా చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అన్ని తరగతుల అడ్మిషన్లకు రూల్ ఆఫ్
రిజర్వేషన్ వర్తింపజేయనుంది. 6 నుంచి పదో తరగతి వరకు ఒక్కో
సెక్షన్లో 40 సీట్ల చొప్పున 2 సెక్షన్లకు
కలిపి 80 సీట్లు ఉంటాయి. ఇంటర్మీడియెట్ లో మాత్రం ఒక్కో
గ్రూపునకు 20 సీట్లు ఉంటాయి. ఎంపీసీ, బైపీసీ,
హెచ్ ఈసీ, సీఈసీ గ్రూపులకు ఆడ్మిషన్లు
నిర్వహిస్తారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ సోమవారం ఈ మేరకు
ఉత్తర్వులు జారీ చేశారు.
School Education
– A.P.Model Schools – Guidelines and procedure for admission of
students into
Model Schools for classes VI and Intermediate from the Academic Year
2020-21 – Orders
– Issued.
G.O.MS.No. 32, Dated: 29-06-2020.
0 Komentar