AP Red Cross Society Mobile APP
రెడ్ క్రాస్ లో భాగస్వాములుకండి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఉత్తర్వులు ప్రకారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉపాధ్యాయులను , 8 వ తరగతి నుండి 10 వ తరగతి విద్యార్థులను మరియు విద్యార్థుల తల్లి దండ్రులను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నందు భాగస్వామ్యులను చేయుటకు ఒక యాప్ ను రూపొందించినారు.
★ ఉపాధ్యాయులు , విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లి దండ్రులు అందరు తప్పైనిసరిగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ కావలెను.
★ రిజిస్ట్రేషన్ రెండు క్యాటగిరీ ల గా ఉంటుంది. ఒకటి విద్యార్థులకు(8 వ తరగతి నుండి 10 వ తరగతి చదువు చున్న విద్యార్థులకు మాత్రమే) సేవ కార్యకర్తగా, రెండు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లి దండ్రులు సేవ కార్యకర్తగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను.
★ ప్రతి విద్యార్థి విడి విడి గా వ్యక్తిగతంగా నమోదు చేసుకొనవలెను.
★ రెడ్ క్రాస్ స్వచ్చంద సేవ కార్యకర్తల నమోదు మీద నొక్కండి. ఆధార్ నెంబరు ను నమోదు చేసి తరువాత రిజిస్టర్ చేసుకొనిన మీ తల్లి గారి ఫోన్ నెంబర్ కు వచ్చిన OTP ను నమోదు చేయండి.
★ మీరు ఇంతకు ముందు పొందు పరచిన పూర్తిగా నింపిన మీ వ్యక్తిగత వివరాలు కనిపించును .మరియు ఇంకను ఏమైనా గదులు ఖాళీగా ఉంటె పూరించండి. తరువాత సబ్మిట్ నొక్కండి.
★ రెడ్ క్రాస్ స్వచ్చంద సేవ కార్యకర్త గుర్తింపు కార్డు మీద నొక్కి డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకొనండి.
★ తదుపరి ఏమి చేయవలెనో ప్రారంభ పేజీ లోని రీడింగ్ మెటీరియల్ ద్వారా వెళ్ళండి.
★ ఇదే ప్రక్రియ ను మీ తల్లి గారి అదే రిజిస్టర్ ఫోన్ నెంబర్ ద్వారా కుటుంబము లోని మిగిలిన పిల్లలకు చేయాలి.
★ ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటె ప్రతి పిల్ల వానికి రిజిస్టర్ పూర్తి చేసి logout అయ్యి మరొకరికి ప్రారంభించాలి.
ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లి దండ్రుల కొరకు
★ ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లి దండ్రులు నమోదు చేసుకొనుటకు పై విధంగా యాప్ డౌన్లోడ్ చేసుకొని రెడ్ క్రాస్ స్వచ్చంద సేవ కార్యకర్త గా నమోదు కొరకు దగ్గర గ్లిక్ చేయండి.
★ స్వచ్చంద సేవ కార్యకర్త వివరాల కొరకు పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వ్యక్థగత వివరాలు నింపాలి. చివరిగా ఫోటో అప్లోడ్ చేయాలి.
★ నమోదు అయినా పిదప లాగిన్ అయ్యి రీడింగ్ మెటీరియల్ ను follow అవ్వండి.
AP RED CROSS MOBILE APP
0 Komentar