ఉపాధ్యాయ బదిలీలలో పనితీరు ఆధారిత పాయింట్లు తొలగింపు..!
ఉపాధ్యాయ
బదిలీలకు పాఠశాల విద్యాశాఖ నిబంధనలను సిద్ధంచేస్తోంది...
>బదిలీల
ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయనున్నారు.
>గతంలో వివాదాస్పదమైన
పనితీరు ఆధారిత పాయింట్లను తొలగించే అంశాన్ని పరిశీలుస్తున్నారు.
>కేవలం ఉపాధ్యాయులు
పనిచేసే పాఠశాల ప్రాంతం, ఉపాధ్యాయుడి సర్వీసు ఆధారంగా పాయింట్లు
కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
>విద్యార్ధుల
సంఖ్య తక్కువగా ఉన్న ఏ ఒక్క పాఠశాల కూడా రద్దు చేయరు.
>విద్యార్ధుల
సంఖ్యను బట్టి, పదవీ విరమణ చేసిన, పదోన్నతిపై
వెళ్ళిన ఉపాధ్యాయుల సంఖ్యను బట్టి ముందుగా పోస్టులను క్రమబద్దీకరించవలసి ఉన్నది.
>ప్రతి
పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించేలా కసరత్తు చేస్తున్నారు.
>జులై 15
తర్వాత బదిలీలు చేపట్టినా ఇందుకు సంబంధించిన కసరత్తు జూన్‌లోనే కొనసాగనుంది.
>అలాగే జూన్
30 లేదా జులై 1ని కటాఫ్ తేదీగా తీసుకుని సర్వీసు లెక్కించే అవకాశం ఉంది.
>కనీసం
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.
>అయితే గతంలో
వలే గరిష్ట సర్వీసు 8సం. ఉండే అవకాశం ఉన్నది.
>బదిలీలకోసం మొదట
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఖాళీల ఎంపికకు సమయం ఇస్తారు.
>పాఠశాల
ప్రాంతం HRA 20% కేటగిరి-1కు ఏడాదికి 1పాయింటు, HRA 14.5% ఉండే వాటికి 2పాయింట్లు, HRA 12% ఉండే వాటికి 3పాయింట్లు.
>బస్సు
సదుపాయం లేని ప్రాంతానికి 4పాయింట్లు.
ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్...
సీఎం
విద్యాశాఖ లో చేపడుతున్న నాడు-నేడు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం
గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 10వ తరగతి పరీక్షల తర్వాత బదిలీలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. బదిలీల
ప్రక్రియ మొత్తం ఆన్లైన్ పద్ధతిలోనే నిర్వహించాలని , విద్యార్ధుల
సంఖ్యను బట్టి బదిలీలు జరపాలని, గిరిజన ప్రాంతాల్లోని
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ
సందర్భంగా విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా 10వ తరగతి పరీక్షలపై దృష్టి సారిస్తున్నామని, పరీక్షల అనంతరం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపడతామని అన్నారు.
త్వరలోనే బదిలీలపై విధి విధానాలు ఖరారు చేస్తామని మంత్రి తెలియజేసారు. స్కూల్స్ ప్రారంభం అయ్యే లోపు
టీచర్ల బదీలీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు
లేరన్న సాకుతో ఒక్క స్కూల్ కూడా మూయడానికి వీల్లేదని సీఎం వైఎస్ జగన్
ఆదేశించారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
ఈ
సందర్భం గా నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ
పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న బెంచీలు, చాక్
బోర్డులు, ఫ్యాన్లు, వాటర్
ఫ్యూరిఫయర్లు, స్టోరేజ్ ర్యాక్ లు ఇతర సదుపాయాలను
ముఖ్యమంత్రి పరిశీలించడం జరిగింది.
సంభందిత
వీడియో...
0 Komentar