Azim Premji
Foundation Guidelines on Beginning of Schools
బడుల ప్రారంభంపై
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్
మార్గదర్శకాలు
-పని దినాలు..
సిలబస్ తగ్గింపు -రద్దీ పాఠశాలల్లో షిఫ్టు పద్ధతిలో బోధన
‘కరోనా సమయంలో పాఠశాలలు- కీలకమైన
అంశాల్లో ఏం చేయాలి’ పేరిట అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్
మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా విపత్తు నేపథ్యంలో కొత్త విద్యాసంవత్సరంలో
పాఠశాలలు పనిదినాలు తగ్గనుండటంతో ఆ మేరకు పాఠ్య ప్రణాళికలోనూ మార్పులు చేయాలని
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ పేర్కొంది. విద్యార్థుల ఇంటి వద్దకే అవసరమైన పాఠ్య
పుస్తకాలు, నోటు పుస్తకాలు, పాఠ్యాంశాల
మెటీరియల్ అందించాలని సూచించింది.
విద్యార్థుల
సంఖ్య ఆధారంగా రద్దీ, తక్కువ రద్దీ కేటగిరీలుగా పాఠశాలల్ని
విభజించాలి. రెడ్, ఆరెంజ్, గ్రీన్
జోన్లలో ఉన్నప్పటికీ రద్దీ ఎక్కువగా ఉంటే విద్యార్థులకు రోజు విడిచి రోజు లేదా
షిఫ్టుల పద్ధతిలో తరగతులు నిర్వహించాలి. ప్రతి వారం నిర్దేశించిన రోజున చెప్పిన
తరగతుల విద్యార్థులు మాత్రమే హాజరుకావాలి. తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు భోజనం
ఇవ్వడంతో పాటు పాఠశాలకు రాని వారికి రేషన్ సరకులు, ఆహార
ప్యాకెట్లు అందించాలి.
పాఠశాల
విద్యార్థులు, టీచర్లు, సిబ్బందికి సబ్బు,
నీళ్లు, మాస్కులు అందుబాటులో ఉండాలి. పది
పరీక్షలకు బదులుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రూపొందించాలి. పాఠశాల విద్యాశాఖ రెడ్,
ఆరెంజ్, గ్రీన్ జోన్లతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా పాఠశాలల నిర్వహణకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలి.
అలాగే తరగతి గది విస్తీర్ణాన్ని బట్టి 1200 చ.అ. లకు 54 మంది, 500 చ.అ. లకు 20 మంది, 270 చ.అ. లకు 12 మంది, 180
చ.అ లకు 9 మంది విద్యార్ధులు ఉండాలని
సూచించింది.
తరగతుల నిర్వహణ
నమూనా ఇలా ఉండాలి
సిలబస్
తగ్గింపులో తప్పనిసరి బోధించాల్సిన అంశాలను గుర్తించి, మిగతా
విషయాలను సాధారణంగా చదువుకునే అవకాశమివ్వాలి. ఎప్పటికప్పుడు విద్యార్థుల ప్రగతిని
మదింపు చేయాలి. వార్షిక పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుంటే ఈ మదింపుతో గ్రేడ్‌లు
కేటాయించే వీలుంది.
*1-3 తరగతులకు వారానికి 5 గంటలు బోధన ఉండాలి. భాషలు,
గణితంపై దృష్టి పెట్టాలి.
*4-5 తరగతులకు వారానికి 6 గంటల బోధన సమయాన్ని
కేటాయించాలి. భాషలు, గణితం, పర్యావరణంపై
పాఠాలు ఉండాలి.
*6-8 తరగతులకు వారానికి 10 గంటల బోధన జరగాలి. భాషలు,
గణితం, సైన్స్, సోషల్
స్టడీస్‌పై దృష్టిపెట్టాలి.
*9-10 తరగతుల విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుకు వారానికి 3
గంటల చొప్పున బోధన సమయం కేటాయించాలి. పాఠశాలతో పాటు ఇంట్లోనూ స్వీయ శిక్షణ కలిపి ఈ
బోధన గంటలు నిర్ణయించారు.
0 Komentar