పీచు పదార్థం
వల్ల ఉపయోగాలు, పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు
పీచు పదార్థం
పీచు పదార్థం మన
దైనందిక ఆహారంలో ఒక భాగముగా ఉండాలి. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాలు
తీసుకోవాలి, జంక్‌ఫుడ్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతిరోజూ తీసుకునే
ఆహారంలో 26 గ్రాముల పీచు పదార్థాలతో నిండిన ఆహారంగా ఉండాలి. పీచు పదార్ధముండే ఆహార
పదార్ధాలను మనం తీసుకుంటే పెద్ద ప్రేవులలో నిల్వ ఉండే మలాన్ని తొలగించడానికి
ఉపయోగపడతాయి.
పీచు పదార్థం
వల్ల ఉపయోగాలు
>మన పేగుల్ని
ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వల్ని
తగ్గిస్తుంది.
>బరువు
తగ్గించటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ నిల్వల్నీ తగ్గిస్తుంది.
>పీచు పదార్ధాలు
శరీరంలో జీర్ణం కాకుండా, ఎక్కువ మలం తయారు కావటానికి దోహద పడతాయి.
>దీని వలన జీర్ణాశయం
అనవసరమైన పదార్ధాలను జీర్ణించుకోదు.
>పిండి
పదార్ధాల,
క్రొవ్వుపదార్ధాల శోషణ ప్రక్రియను ఆలస్యం చేస్తుంది.
>పొట్ట
నిండుగా ఉన్నట్లనిపించడం వల్ల అధికంగా తినడం తగ్గుతుంది.
>కరిగే
పీచుపదార్ధములు సీరమ్ కోలెస్టరాల్ మొత్తంలోస్థాయిని తగ్గిస్తుంది.
>మధ్యాహ్న
భోజనానంతరం మన రక్తంలోగల చక్కెరస్థాయిని తగ్గిస్తుంది.
>మల విసర్జన
చాలా సులభంగా అవుతుంది. మల బద్దకం ఉన్న వారు పీచు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలి.
పీచు లభించే ఆహార
పదార్థాలు
>పీచుకోసం
చిక్కుళ్లు, బీన్స్ వంటి కూరగాయలు, పండ్లు,
ముడి ధాన్యాలు, గోధుమలు, డ్రైఫ్రూట్స్ సమృద్ధిగా తీసుకోవాలి.
>ఆపిల్, జామ
కాయ, అరటి పండు, ఆకు కూరలు, ఓట్స్ లలో పీచు పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.
>సీజన్‌లో
దొరికే ఆపిల్‌ను రోజుకొకటి తినండి. అందుబాటు ధరలో అద్భుతమైన పీచును అందించే పండు
ఇది. ఒక ఆపిల్‌లో 4.4 గ్రాముల పీచు లభిస్తుంది.
>పచ్చి
కూరగాయలు,
ఆకుకూరలలో పీచు పదార్థమే కాకుండా శరీరానికి కావలసిన మెగ్నిషియం కూడా
లభిస్తుంది.
>ముల్లంగి జీర్ణవ్యవస్థను
క్రమబద్దీకరిస్తుంది. తొమ్మిది అంగుళాల ముల్లంగిలో సుమారుగా 5.8 గ్రాముల పీచు
దొరుకుతుంది.
>ఒక చిన్న
కప్పు బ్రకోలి తింటే ఎన్నెన్నో లాభాలు. ఉడికించి తినడం ఇంకా మంచిది. ఒక కప్పు
పరిమాణం తీసుకుంటే 2.4 గ్రాముల పీచు శరీరానికి అందించినట్లే!
>క్యాబేజిని
సలాడ్లు,
వేపుళ్లులలో విరివిగా వాడొచ్చు. శరీరంలోని క్యాన్సర్ కారకాలను
నిరోధించే శక్తి క్యాబేజికి ఉంది. ఇందులో ఒక పొర ఆకులో 0.5 గ్రాముల పైబర్
ఉంటుంది.
>వంద గ్రాముల
పచ్చి క్యారెట్‌లో 2.9 గ్రాముల పైబర్ ఉంటుంది. అదే ఉడికిస్తే ఆరు గ్రాముల పైబర్
తగ్గుతుంది.
>ఒక కట్ట
పాలకూరలో కనీసం 7.5 గ్రాముల పీచు దొరుకు తుంది.
>పండ్లు, కూరగాయలు,
బీన్స్, ధాన్యాలు వంటి వాటిల్లో పీచు పదార్థం
అధిక మోతాదులో ఉంటుంది.
>పండ్లపై గల
తొక్కభాగంలో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది.
>తృణధాన్యాలతో
తయారుచేసిన బ్రెడ్ మంచిది.
>మెంతులలో
నీటిలో కరిగే పీచుపదార్ధం అధికంగా ఉండడం వలన రక్తంలోని చక్కెర స్థాయిని, సిరమ్
కోలెస్ట్రా ల్, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంలో ప్రభావితం
చేస్తుంది.
మనం
రోజూ తీసుకొనే ఆహార పదార్ధాలలో గల పీచు పదార్ధ పరిమాణం (100గ్రాములకు)
అధికం (10 కన్నా ఎక్కువ)
|
మధ్యస్థం (1నుండి10)
|
తక్కువ
(1కన్న) |
లేనివి
|
గోధుమ,
జొన్న, రాగి, మొక్కజొన్న, లెగ్యూమ్‌లు,పప్పులు
|
వరి,
చాలా కాయగూరలలో, కొబ్బరి, చాలా పండ్లలో, నువ్వులు
|
శుద్ధిచేసిన
బాగా వేయించి వండిన
ఆహారపదార్ధాలు
|
చక్కెర,
నూనెలు, పాలు, మాంసం
|
0 Komentar