డీవైఈవోల
వ్యవస్థ రద్దు? ఎంఈవోలకు ఉన్నత పాఠశాలల
పర్యవేక్షణ భాద్యతలు
ఆంధ్రప్రదేశ్
పాఠశాల విద్యా శాఖలో పలు మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుసున్నది. డివిజన్
స్థాయిలో ఇప్పుడున్న ఉప విద్యాశాఖాధికారుల (DyEo) వ్యవస్థను రద్దుకు చేయడం, అదే
సమయంలో మండల విద్యాశాఖాధికారులకు (ఎంఈవో) మండలంలోని ఉన్నత పాఠశాలలపై
పర్యవేక్షణాధికారాలను అప్పగించనున్నారు. దీనికి సంబంధించి ముసాయిదా సిద్ధమైనట్లు
తెలుస్తున్నది. అలాగే కాంప్లెక్స్ హెచ్ఎంలను బలోపేతం చేయడంతోపాటు, కాంప్లెక్స్ పరిధిలోని
అన్ని పాఠశాలల పర్యవేక్షణను హెచ్ఎంలకు అప్పగించనున్నారు.
డీఈవోలకు ఇప్పుడున్న అధికారాల్లో దాదాపు 60 % అధికారాలు జాయింట్
కలెక్టర్ (అభివృద్ధి)లకు కట్టబెట్టనున్నారు. టీచర్ల సస్పెన్షన్, ఎత్తివేత అధికారాలతోపాటు, పలు సర్వీసు సంబంధిత
అధికారాలు, పాఠశాలల అభివృద్ధి వంటివి
జేసీల పరిధిలోకి రానున్నాయి. ఇక డీఈవోలు అకడమిక్ సంబంధిత అంశాలకే
పరిమితమవనున్నారు. ఈ ముసాయిదాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
0 Komentar