Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Causes and Precautions of Migraine Headache


పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్)
పార్శ్వపు తలనొప్పి లేదా మైగ్రేన్ తలనొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. ఇది స్త్రీలలో అధికంగా వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. చాలామంది పార్శ్వనొప్ప తలలో ఒకవైపే వస్తుందని భావిస్తుంటారు. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా రావచ్చు.
వ్యాధి కారణాలు
>పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది.
>డిప్రెషన్, నిద్రలేమి
>కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల
>అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది.
>స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది.
>గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.
>ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు.
మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
>మానసిక ఆందోళనలు తగ్గించాలి.
>అతిగా ఆలోచనలు చేయకూడదు.
>మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత ఇస్తుంది.
>తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు సేదతీరుతాయి.
>తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతి లేనిచోట నిశ్శబ్దంగా ఉన్నచోట ఉండాలి.
మైగ్రేన్ తలనొప్పి కి ముందు గా హెచ్చరించే సూచనలు
>కళ్ళ ముందు జిగ్ జాగ్ లైన్లు కనపడటం, కళ్లు చీకట్లు కమ్మడం, కళ్లలో నీళ్లు రావడం, కళ్లెర్రబడటం.
>చెవులలో శబ్దాలు, మాట్లాడలేకపోవడం, శరీరం ఒక పక్క సూదులు గుచ్చినట్టు వుండటం.
>ఈ లక్షణాలు మైగ్రేన్ తలనొప్పి రాబోతోందని సూచిస్తాయి వీటినే "ఆరా "అంటారు..
మైగ్రేన్ తలనొప్పిని నివారించడానికి ఉపయోగపడే ఆహారపదార్ధాలు
>గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ మెగ్నీషియం అధికంగా ఉండడం వలన మైగ్రేన్ తలనొప్పి తగ్గించడంలో బాగా సహాపడుతుంది. అంతేకాకుండా గోధుమలు, సీఫుడ్ వంటి వాటిలో మైగ్రేన్ తలనొప్పి తగ్గించే మెగ్నీషియం అధికంగా ఉంటుంది.
>చేపల్లో ఓమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉండటం వల్ల మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడానికి బాగా సహాయపడుతాయి.
>లోఫ్యాట్ డైరీ ఉత్పత్తి అయిన పాలు మైగ్రేన్ తగ్గిస్తుంది. పాలలో విటమిన్ బి(రెబొఫ్లెవిన్)కణాల శక్తిని పెంచి మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది.
>ఒక కప్పు వేడి వేడి సొంఠి కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. కాఫీలో ఉన్న కెఫిన్ మైగ్రేన్ తలనొప్పిని నివారిస్తుంది.
>మనలో వ్యాధి నిరోధక శక్తిని పుష్కలంగా కల్పించే పోషకాలు ఒమేగా-3 ఫ్యాట్స్ అవిసెలో సమృద్ధిగా ఉంటాయి. ఈ అవిసె గింజలు మైగ్రేన్ తలనొప్పిని కూడా నివారిస్తుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులుఅధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.
Previous
Next Post »
0 Komentar

Google Tags