CBSE 10, 12వ తరగతి పరీక్షలు రద్దు
సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ సందర్భంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర మానవవనరుల శాఖ సుప్రీంకోర్టుకు తెలిపింది. జులై 1 నుంచి 15 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఐసీఎస్‌ఈ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే నిర్వహించడానికి కేంద్రం నిర్ణయించింది.
12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. పరీక్షకు హాజరవ్వాలా? లేక ఇంటర్నల్ మార్కుల ద్వారా సర్టిఫికెట్ తీసుకోవాలో అనే నిర్ణయాధికారాన్ని విద్యార్థులకు ఇచ్చినట్లు సీబీఎస్‌ఈ కోర్టుకు వివరించింది. ఆ ఫలితాలను జులై 15న వెల్లడిస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇక సీబీఎస్ఈ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని.. రేపటిలోగా నోటిఫికేషన్‌గా విడుదల చేస్తామని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది.
0 Komentar