సిలబస్, బోధన సమయం
కుదింపు దిశగా కేంద్రం
కరోనా నేపథ్యంలో
ఈ విద్యా సంవత్సరం నుంచి సిలబస్, పని గంటల్లో మార్పులకు శ్రీకారం
చుట్టే యోచనలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉంది. దీనికి అనుగుణంగా కేంద్ర
మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ మంగళవారం ట్వీట్
చేశారు. సిలబస్, బోధనా సమయాన్ని తగ్గించాలని
యోచిస్తున్నట్టు వెల్లడి చేశారు. ఈ
విషయంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు
‘‘#SyllabusForStudents2020’ హాష్ ట్యాగ్‌తో ట్విటర్,
ఫేస్‌బుక్‌లలో సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల
ద్వారా వచ్చే సలహాలు, సూచనలను తుది నిర్ణయ సమయంలో పరిగణనలోకి
తీసుకుంటామన్నారు. ఆధునిక సాంకేతికత, నవకల్పన పునాదులపై
సరికొత్త విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు నిశాంక్ చెప్పారు. విద్యాదాన్ పథకం కింద రోటరీ సంస్థ 1-12 తరగతుల
పాఠ్యాంశాలన్నింటినీ హిందీ భాషలో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి
మొత్తం 12 ఎన్‌సీఈఆర్‌టీ ఛానళ్ల ద్వారా ఈ పాఠాలను
ప్రసారమవుతాయి.
0 Komentar