CISCE Class 10,
12 students can opt out of pending exams
విద్యార్థులకు
రెండు ఆప్షన్లు ఇస్తున్నాం
-10, 12వ తరగతి పరీక్షలపై ముంబై హైకోర్టుకు తెలిపిన ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్
ఎగ్జామినేషన్ బోర్డు
ఐఎస్ఈసీ 10, 12వ తరగతి పరీక్షలు జరపాలని నిర్ణయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై
ముంబై హైకోర్టు సోమవారం విచారణ సందర్భంగా 10, 12వ తరగతి
పరీక్షల్లో ఉత్తీర్ణతకు సంబంధించి దేశ, విదేశాల్లోని
విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇస్తున్నట్లు ఐఎస్ సీఈ కోర్టుకు తెలిపింది. లాక్డౌన్
సమయానికి రాయగా మిగిలిన సబ్జెక్టులకు జూలైలో పరీక్షలు రాయడం లేదా ప్రి-బోర్డు
పరీక్షలు అంతర్గత అంచనా ద్వారా మార్కులు వేసే విధానానికి అంగీకరించడం. ఈ
రెండింటిలో తమకు నచ్చిన విధానాన్ని ఎంపిక చేసుకునే వీలుంటుందని తెలిపింది. ఈ
విషయాన్ని స్కూళ్లకు తెలిపామని, విద్యార్థుల నుంచి ఆప్షన్లు
అందాక ఆ మేరకు 22వ తేదీ కల్లా ఒక అంచనాకు వస్తామని
పేర్కొంది.
0 Komentar