షుగర్
ప్రస్తుతం యువత
దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపెడుతున్న వ్యాధి షుగర్. మారుతున్న జీవన
విధానాలు,
ఆహారపు అలవాట్లు, సాంఘిక, పౌష్టికాహార లోపం, పర్యావరణంలో కలుగుతున్న మార్పులు,
కాలుష్యం ఇవన్నీ కలిసి మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్యను గణనీయంగా
పెంచుతున్నాయి. డయాబెటిస్ ఉన్న వాళ్ళు తమకు తాముగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది.
షుగర్ ఉన్న వారు
తినగూడని ఆహార పదార్ధాలు
>వైట్ బ్రెడ్, వైట్
రైస్, వైట్ పాస్తా వంటి తెల్ల పిండితో చేసిన ఆహార పదార్థాలలో
చక్కెర శాతం, కార్బోహైడ్రేడ్లు అధికం. ఇవి మన శరీరంలో షుగర్
లెవెల్స్ ని అమాంతం పెంచేస్తాయి.
>హోల్ మిల్క్, క్రీమ్స్,
ఎక్కువ ఫాట్ ఉన్న యోఘర్ట్, చీస్ మరియు
క్రీమ్స్ చీస్ లలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాలను మరింత
పెంచేస్తుంది.
>భూమిలోపల
పండే వెజిటేబుల్స్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇటువంటి వెజిటేబుల్స్
బ్లడ్ షుగర్ లెవల్స్ ను అతి త్వరగా పెంచేస్తాయి.
>పండ్ల రసాలను
ఎక్కువగా తీసుకోకూడదు
>ఎండు
ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం,
ఫ్రక్టోజ్, గ్లూకోజ్, యాంటి
ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
>
బంగాళాదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో వాడే పదార్థాలు షుగర్ పేషెంట్లకు
మంచిదికాదు.
>తియ్యగా ఉండే
సాఫ్ట్,
ఎనర్జీ డ్రింక్స్ కి కూడా షుగర్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. వీటిలో
కొలస్ట్రాలను పెంచే రసాయనాలు ఉంటాయి. వీటి వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
>కృత్రిమంగా
తయారుచేసిన తీపి పదార్థాలను మంచివి కావు.
>మేక, గొర్రె
మాంసాలకు షుగర్ పేషెంట్లు దూరంగా ఉంటే మంచిది.
> ఇన్సులిన్
లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు బీన్స్ ను తినకపోవడమే ఉత్తమం.
>పచ్చి
టమోటోలను తినడం నివారించాలి. వంటకు కూడా చాలా తక్కువ టమోటోలను ఉపయోగించాలి.
>డయాబెటిక్
లక్షణాలు ఉంటే స్వీట్ కార్న్ తినడం నిలిపివేయండి.
>అరటిలో పిండి
పదార్థాలు ఉంటాయి. అంతే కాదు వాటికి అవే తీపిగా మార్చుతాయి.
సింపుల్ గా
చెప్పాలంటే మధు మేహ వ్యాధిగ్రస్ధులు తినకూడని ఆహార పదార్ధాలు
>దుంప కూరలు
(ఉదా: బంగాళ దుంప, చామ దుంప )
>చాక్ లేట్లు, తీపి
పదార్ధాలు, పుడ్డింగులు
>నూనెలో వేపిన
పదార్ధాలు
>డ్రై
ఫ్రుట్స్ ( పండ్లు) (ఉదా: ఎండు ద్రాక్ష, అంజీరా )
>చక్కెర
>అరటి పండు, సపోటా,
సీతాఫలము (కస్థడ్డ్ ఆపిల్)
0 Komentar