చైనా యాప్‌లకు
ప్రత్యామ్నాయ యాప్‌ల వివరాలు
దేశ భద్రత
దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్ తో సహా 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు
ప్రకటించింది. ఈ నేపథ్యంలో అలాంటి యాప్‌లకు ప్రత్యామ్నాయ యాప్‌ల వివరాలు..
>ఫైల్‌షేరింగ్
యాప్ 'షేర్‌ఇట్' కు బదులు షేర్ ఫైల్స్, ఫైల్స్ బై గూగుల్‌ను
వినియోగించవచ్చు.
>వీడియో
కాన్ఫరెన్స్ 'జూమ్' యాప్ కి బదులు గూగుల్ మీట్, స్కైప్,
మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ డుయో, వాట్సాప్ కాల్, సే నమస్తే యాప్‌ను లాంటివి వాడుకొవచ్చు.
>'యూసీ బ్రౌజర్'కు బదులు గూగుల్ క్రోమ్, ఒపేరా, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ లాంటి బ్రౌజర్లు ట్రై చేయొచ్చు.
>'యాప్‌లాక్ వాల్ట్'
కు బదులుగా లాక్ యాప్ - స్మార్ట్ యాప్ లాకర్, లాక్ యాప్ -
ఫింగర్‌ప్రింట్, కీప్ సేఫ్, నొర్టన్
యాప్ లాక్ తదితర యాప్స్ ను వాడవచ్చు.
>'క్యామ్
స్కానర్ యాప్' (CS SCANNER) కు బదులు అడొబ్ స్కాన్, మైక్రోసాఫ్ట్
లెన్స్, ఫొటో స్కాన్ బై గూగుల్, డాక్యూమెంట్ స్కానర్-పీడీఎఫ్ క్రియేటర్‌ను
ప్రయత్నించొచ్చు.
>ఫొటోలకు అదనపు
హంగులు అద్దడం కోసం యూక్యామ్, బ్యూటీక్యామ్, బ్యూటీ
ప్లస్ యాప్‌లకు బదులు పిక్స్ ఆర్ట్,
అడొబ్ ఫొటోషాప్, లైట్ రూమ్, గూగుల్ స్నాప్‌సీడ్, బీ612 యాప్స్ ను ప్రయత్నించవచ్చు.
>'ప్యార్‌లల్
స్పేస్,
డ్యూయల్' స్పేస్ కి బదులు క్లోన్ యాప్, సూపర్ క్లోన్ వంటి యాప్స్‌ను ట్రై చేయొచ్చు.
>'WPS ఆఫీస్ యాప్' కు బదులు మైక్రోసాఫ్ట్
ఆఫీస్, ఓన్లీ ఆఫీస్ లాంటివి వాడొచ్చు.
>వీడియోలను
సులభంగా ఎడిట్ చేయడానికి వైవా వీడియో, వైవా కట్ బదులు కైన్
మాస్టర్, అడొబ్ ప్రిమియర్ క్లిప్ వాడుకోవచ్చు.
>వీడియో
షేరింగ్ యాప్ 'టిక్‌టాక్'కు బదులు లైక్, రొపొసొ,
పెరిస్కోప్ లాంటి వాటిని కూడా
ప్రయత్నించవచ్చు.
>సెక్యూరిటీ
యాప్ 'వన్ సెక్యూరిటీ యాప్' బదులు ఏవీజీ, అవాస్టా, నార్తన్ యాంటీ వైరస్ వంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
>'యూ డిక్షనరీ' యాప్‌కు ప్రత్యామ్నాయంగా ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ యాప్, గూగుల్ ట్రాన్స్‌లేట్ లాంటి యాప్స్
వాడొచ్చు.
helo kuda vundhiga block listlo
ReplyDeletekonchem alochinchi raayandi