ఉద్యోగుల సమాచారం
డిజిటలీకరణ
ఇక ఎవరి ప్రమేయం
లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతభత్యాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ..
హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (హెచ్
సీఎం) వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ అనుబంధ విభాగాల
ఉద్యోగులకు ఈ వ్యవస్థ ద్వారా జీతభత్యాలను చెల్లిస్తోంది. దశల వారీగా మిగతా శాఖల
ఉద్యోగులందరికీ ఈ వ్యవస్థ ద్వారానే జీతభత్యాలు చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.
ఉద్యోగుల నియామకం నుంచి పదవీ విరమణ వరకు డిజిటలీకరణ చేయనున్నారు.
>ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే ఉద్యోగులు తమ జీతభత్యాల కోసం డ్రాయింగ్ అండ్
డిస్బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీవోలు) చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
>ఈ ప్రక్రియలో
ఉద్యోగుల ఇంక్రిమెంట్, ప్రమోషన్, వంటి ప్రతి
అంశాన్ని నమోదు చేస్తారు. దీనివల్ల జాప్యం లేకుండా ప్రతి పని నిర్ణీత వ్యవధిలో
పూర్తవుతుంది
>పదవీ విరమణ
చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల తోపాటు మిగతా ఉద్యోగులకు సంబంధించిన అంశాలకు
కాలక్రమంలో నిర్ణీత గడువును నిర్ధారించుకున్నారు
>ఉద్యోగుల
సర్వీసు పుస్తకాలన్నింటినీ కంప్యూటరీకరించడంతో అందులో ఉన్న వివరాలన్నీ ప్రభుత్వ వెబ్
సైట్ లో ఉంటాయి.
>ప్రతి నెలా
ఉద్యోగులకు రావాల్సిన పరిహారాలు ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి.
>దీని కోసం
రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ఉద్యోగుల జీతాలే కాకుండా ఇంక్రిమెంట్లు, ఎన్క్యాష్
మెంట్ లీవులు వంటివన్నీ ఏ నెలకానెల నమోదవుతాయి.
>తనకు
ఇంక్రిమెంట్ కావాలని, జీతాలు పెంచాలని ఉద్యోగులు కోరుకునే
పరిస్థితి ఉండదు.
>ప్రభుత్వం
కరువు భత్యం పెంచితే తక్షణం ఉద్యోగుల ఖాతాలో జమ అవుతుంది.
తేది. 13 జూన్ 2020 నాటి ‘సాక్షి’
దినపత్రిక సౌజన్యంతో..
0 Komentar