సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయంలో ‘మన బడి నాడు -నేడు’ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని తెలిపారు. అలానే ఆగస్టు చివరి నాటికి పాఠశాలలను తెరిచే ఆలోచనలో ఉన్నామని మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ ను విడుదల చేశారు. ఏ సమస్య ఉన్నా ‘1800 123 123 124’ నంబర్‌కు ఫోన్ చేయొచ్చని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలన్నదే సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. మరుగుదొడ్లు, టేబుల్స్, తాగునీరు, ప్రహరీగోడలు వంటి తొమ్మిది అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
ప్రతి శనివారం ‘మన బడి నాడు- నేడు’పై సమీక్ష నిర్వహిస్తామని, ఇప్పటి వరకు రూ.504 కోట్లు పైగా ఖర్చు చేశామని పేర్కొన్నారు. రూ. 710 కోట్లు రివాలింగ్ ఫండ్ తీసుకువచ్చామని తెలిపారు. పాఠశాలలు తెరిచేలోగా ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని వెల్లడి. కోర్టు వివాదాలు పరిష్కరం అవగానే డిఎస్సీ నోటిఫికేషన్ ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు హెడ్మాస్టర్ లు అందరికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్ త్వరలో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
0 Komentar