దూరవిద్యలో పది, ఇంటర్ చదువుతున్న వారిలో ఉత్కంఠ
పరీక్ష పెడతారా..? పాస్ చేస్తారా..?
కరోనా ప్రభావంతో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మరియు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం సీబీఎస్‌ఈ పరీక్షలు రాయాల్సిన విద్యార్థులందరినీ పాస్ చేసిందే.
అయితే వచ్చే నెల 18 నుంచి 24 వరకు పరీక్షలు నిర్వహించనున్న దూరవిద్య విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న వారి విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,68,717 మందిని పాస్ చేస్తారా.. పరీక్ష రాయిస్తారా అనే ఉత్కంఠ ఉంది. రెగ్యులర్ విద్యార్థుల్లా వారికి నిర్మాణాత్మక మూల్యాంకనం & సంగ్రహణాత్మక మూల్యాంకనం పరీక్షలు లేవు దీంతో ఒకవేళ అందరిని పాస్‌చేస్తే మార్కులు ఎలా కేటాయిస్తారనే మీమాంస ఉంది. ఓపెన్ పరీక్షలపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందని అందరిలో ఆసక్తి నెలకొంది.
0 Komentar