కంటైన్‌మెంట్ జోన్లలోని ఉపాధ్యాయులకు మినహాయింపు
-కంటైన్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పించాలని విద్యాశాఖ
కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్న ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావడం నుంచి విద్యాశాఖ మినహాయింపునిచ్చింది. కంటైన్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యం కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. కరోనా కేసులున్న ప్రాంతాలను సంబంధిత మండల అధికారులు లేదా మున్సిపల్ కమిషనర్లు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి ఉండాలన్నారు. ఇందుకోసం ఉపాధ్యాయులు నివాస ధృవీకరణ పత్రం (ఆధార్ / ఓటర్ ఐడీ), కంటైన్మెంట్ ఏరియా కాపీలను జతచేసి డీడీఓల అనుమతితో పాఠశాలకు హాజరు నుంచి మినహాయింపు పొందొచ్చని పాఠశాల విద్య కమిషనర్ చినవీరభద్రుడు సర్కులర్ జారీ చేసారు. పాఠశాల పనులను ఇళ్ల వద్ద నుంచే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
బధిరుల కేటగిరికి చెందిన ఉపాధ్యాయులు, గర్భిణులైన ఉపాధ్యాయినులు, డయాలసిస్, హృద్రోగ వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు కూడా మినహాయింపు ఇచ్చారు. సదరు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు నుంచి మినహాయింపు పొందడానికి ‘ఏపీ టెల్’ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Sir,
ReplyDeleteCan you post the circular of CSE regarding exclusion for teachers in containment zone