Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Food combinations that we should avoid eating

Food combinations that we should avoid
కలిపి తినకుడని ఆహార పదార్థాలు  (విరుద్ధాహారం)
ఆహారపదార్ధాలు ఆరోగ్యకరమైనవే అయినా కొన్ని సందర్బాలలో రెండు రకాల ఆహారపదార్ధాలను కలిపి లేదా వెంటవెంటనే తీసుకోవడం వలన ఇబ్భందులు కలిగే ప్రమాదం ఉంది. ఫుడ్ కాంబినేషన్స్ అనేవి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండాలి కాని ఆరోగ్యాన్ని పాడుచేసే విధంగా ఉండకూడదు. ఫుడ్ కాంబినేషన్స్ విషయంలో సరైన శ్రద్ధ వహించక చేసే పొరపాట్ల వలన అనారోగ్యం బారిన పడతారు.
మనం తినే ఆహారం ఒక్కటే ఐనా మనం ఆహారం పేరుతో రకరకాల పదార్థాలను లోపలికి తీసుకుంటున్నాం. అలాంటి పదార్థాలలోనూ లోపల కొంత శక్తి ఉంటుంది. అవి జీర్ణం అయ్యే సమయాల్లో మార్పువస్తుంది. అవి జీర్ణం అయిన తర్వాత శరీరంలో శోషణం అయ్యే విధానంలోనూ, అవి నిలువ ఉండే పదార్థాలలోనూ అవి మన శరీరంపై చూపించే ప్రభావంలోనూ మార్పులు ఉంటాయి. కాబట్టి కొన్ని రకార ఆహారపదార్థాలను కలిపి తినకూడదు.
కొన్ని విరుద్ధాహార పదార్థాలు
>చేపమాంసాన్ని ఆవనూనెతో కలిపి తినకూడదు.
>పావురం మాంసాన్ని కూడా ఆవనూనెతో కలిపి తినకూడదు.
>కోడిమాంసాన్ని, దుప్పి మాంసాన్ని పెరుగుతో కలిపి తినకూడదు.
>కుసుమనూనెతో మేకమాంసాన్ని తినకూడదు.
>పాలలో ఉప్పు కలిపి త్రాగకూడదు.
>ద్రాక్ష సారాతో బచ్చలి కూర తినకూడదు.
>ముల్లంగితో మినప్పప్పు కలపకూడదు.
>పెరుగు, మజ్జిగ కలిపి అరటిపండు తినకూడదు.
>పెరుగు, బెల్లం, తేనె, నెయ్యితో నిమ్మరసం కలపకూడదు.
>మద్యం, పెరుగు, తేనె వీటిలో వేడి పదార్థములు కలిపి తినకూడదు.
>పాయసము, మద్యము కలిపి తీసుకోకూడదు.
>తేనె, నెయ్యి సమభాగాల్నికలిపి తీసుకోరాదు.
>తేనె, తామర గింజలు కలిపి తీసుకోరాదు.
>పంచదార పానకము, మద్యము, తేనెతో కలిపి తీసుకోకూడదు.
>ఆవనూనెలో వేయించిన మష్రూమ్స్ తినకూడదు.
>తెలగపిండితో కలిపి బచ్చలి తినకూడదు.
>నీటి కొంగ మాంసాన్ని, మద్యాన్ని కలిపి తీసుకోకూడదు.
>ఉడుము మాంసం, నెమలి మాంసం ఆముదం కలిపి వండకూడదు.
>శరీరం వేడిగా ఉన్నప్పుదు ఒకేసారి చల్లని నీటిలో దిగకూడదు.
>ఒళ్ళు బాగా వేడిగా ఉన్నప్పుడు వేడిపాలు త్రాగరాదు. అలాగే చేస్తే చర్మవ్యాధులు వచ్చే ఆవకాశం ఉంది. రక్త సంబంధమైన వ్యాధులు కూడా వచ్చె అవకాశం ఉంది.
>ఆయాసం కల్గించే పనిని చేసిన వెంటనే భోజనం చేయకూడదు.
>పాత ధాన్యం, కొత్త ధాన్య్ం కలిపి వండకూడదు.
>పచ్చివి, పండినవిగా ఉన్న పండ్లు కలిపి తినరాదు.
>పాలు, ఉలవలు కలిపి తినకూడదు. ఎందుకంటే పాలు శీతల గుణాన్ని కలిగించేవి. ఉలవలు ఉష్ణగుణాన్ని కల్గించేవి. ఇది అసదృశ గుణ విరుద్ధం అంటారు.
>పాలు, పనసపండు కలిపి తినరాదు. దీంట్లో పాలు, పనస పండు రెండూ శీతల గుణాన్నే కల్గి ఉన్నా అవి స్వభావంగానే సదృశగుణ విరుద్ధాలు అని చెబుతుంది ఆయుర్వేదం.
>పాలు చేపలు కలిపి తినకూడదు. ఇది సదృశ అసదృశ గుణ విరుద్ధాలకు ఉదాహరణ.
>వేడిచేసిన పెరుగు తినకూడదు. ఇది సంస్కార విరుద్ధం. అనగా పెరుగును వేదిచేత సంస్కరించాం కాబట్టి ఇది విరుద్ధం.
>సమానమైన పరిమాణంలో తేనె, నెయ్యి తీసుకోకూడదు. ఇది మాత్రా విరుద్ధం.
>చవిటి నేలలో ఉన్న నీరు వ్రాగరాదు. ఇది మాత్రా విరుద్ధం.
>రాత్రి పూట పేలాలు, పాప్‌కార్న్ లాంటివి కేవలం పిండిలా పొడిగా ఉండే పదార్థాలను తినకూడదు. అది కాల విరుద్ధం.
>పిండితో చేసిన ఉండలను తింటూ మధ్యలో నీరు త్రాగకూడదు. ఇది సంయోగ విరుద్ధం
Previous
Next Post »

1 comment

Google Tags