Foods not to
keep in refrigerator
ఫ్రిజ్ లో పెట్టకూడని
ఆహార పదార్ధాలు
రిఫ్రిజిరేటర్
(ఫ్రిజ్)లో ఉంచిన ఏ వస్తువైనా కొంతకాలం పాటు చెడకుండా ఉంటుందనేది శాస్త్రీయ
సిద్ధాంతం. ఫ్రిడ్జ్ లో ఆహారాలు, కూరగాయలు, పండ్లు
పెట్టడం వల్ల తాజాగా ఉంటాయని అందరూ భావిస్తాం. అయితే ఫ్రిజ్ ఉంది కదా అని అందులో
ఏవి పడితే వాటిని ఉంచడం ఆరోగ్యకరం కాదంటున్నారు న్యూట్రీషనిస్ట్‌లు. అలాగే కొన్ని
ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి ఫ్లేవర్ మారిపోతాయి. న్యూట్రీషన్స్
తగ్గిపోతాయి. అలాగే అవి చెడిపోయే ప్రమాదం కూడా ఉంది.
అరటి పండ్లు
అరటి పండ్లను
ఫ్రిజ్ లో పెట్టడం వల్ల అందులో ఉండే ఎంజైమ్స్ తగ్గిపోతాయి. దీనితో అరటి పండ్లు
త్వరగా చెడిపోయే అవకాశం ఉంది.
బ్రెడ్
బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో
ఉంచడం వల్ల పెలుసుగా తయారై అందులోని తేమను కోల్పోతుంది. దీనివల్ల బ్రెడ్ తినడానికి
ఫ్రెష్ గా అనిపించదు. కాబట్టి రూమ్ టెంపరేటర్ లో పెట్టాలి.
బంగాళాదుంప
బంగాళాదుంపలను
ఫ్రిజ్‌లో ఉంచితే దుంపలపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడిపోతుంది. వాటితో చేసిన
పదార్థాలు చప్పగా రుచీ-పచీ లేకుండా ఉండటమే కాకుండా ఉడికించడానికి లేదా
వేయించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒక వేళ పెట్టదలుచు కుంటే పేపర్ బ్యాగ్స్
లో పెడితే తాజాగా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్ బ్యాగ్స్ లో పెడితే త్వరగా
కుళ్లిపోతాయి.
టమాట
టమాటాలను
ముఖ్యంగా ఫ్రిజ్‌లో ఉంచరాదు. అలా ఉంచడం వల్ల టమాటాలపై ఉన్న పల్చటి పొర ముడతలు పడి
అందులోని సీ-విటమిన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల
ఫ్లేవర్ మిస్సవుతుంది. అలాగే త్వరగా పండుతాయి. కాబట్టి బయటే పేపర్ బ్యాగ్ లో
పెట్టుకోవడం మంచిది.
తేనె
తేనెను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అది తొందరగా చిక్కబిడిపోవడమే కాకుండా, స్పటికత్వాన్ని పొందుతుంది. కాబట్టి రూం టెంపరేచర్ లో పెట్టుకోవాలి. అయితే సూర్య రశ్మి తగలకుండా పెట్టడం మంచిది.
ఉల్లిపాయలు
ఉల్లిపాయలను
ఫ్రిజ్‌లో ఉంచితే వాటిలోని అధిక నీటి శాతం ఫ్రిజ్ చల్లదనానికి ఐస్‌లా మారి వాటి
పొరలను బాగా దగ్గరకు చేరుస్తుంది. ఇందువల్ల వాటిని వాడే సమయంలో పొరలుగా విడదీయడం
కష్టమవుతుంది. అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలు కలిపి పెట్టడం మంచిది
కాదు. బంగాళాదుంపలు విడుదల చేసే మాయిశ్చరైజర్ వల్ల ఉల్లిపాయలు దెబ్బతింటాయి.
వెల్లుల్లి
వెల్లుల్లిలో
ఉండే ఫ్లేవర్, సువాసన ఫ్రిడ్జ్ లో పెడితే తగ్గిపోతుంది. త్వరగా మొలక
మొలుస్తుంది. అలాగే త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బయటే పెట్టుకోవాలి.
పువ్వులు
పువ్వులను అసలు ఫ్రిజ్
లో పెట్టకూడదు. వీటి వాసన వల్ల ఫ్రిజ్ లో ఉండే ఇతర ఆహార పదార్థాలపైన ప్రభావం
పడుతుంది. ఆ పూల వాసనతో ఇతర ఆహారాలు చేదిపోతాయి.
చిల్లీ హాట్‌సాస్
చిల్లీ హాట్‌సాస్
బాటిల్‌ను ఫ్రిజ్‌ల్లో ఉంచకూడదు. బాటిల్‌ను ఒక ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో
పెడితే కూడా సాస్ నిల్వ ఉండడానికి వాడిన ఫ్రిజర్వేటివ్‌లో రసాయన చర్య సంభవించి
ఫంగస్ ఏర్పడుతుంది.
పుచ్చకాయ
పుచ్చకాయలను కానీ, కోసిన
పుచ్చ దబ్బ లను కానీ ఫ్రిజ్‌ల్లో పెట్టరాదు. అలాచేస్తే దానిలోని యాంటీ ఆక్సిడెంట్లన్నీ
చనిపోతాయి. ఇందువల్ల తియ్యగా ఉండాల్సిన పుచ్చకాయ మనకు రుచి మారిపోతుంది. కాబట్టి
రూమ్ టెంపరేచర్ లోనే పెటట్డం మంచిది.
మునక్కాడ
మునక్కాడలను(మునక్కాయలు)
పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి. కొయ్య ముక్కల్లా తయారైపోతాయి. వీటిని సాధారణ గది
ఉష్ణోగ్రతలోనే నిల్వచేయడం ఉత్తమం.
కొన్ని రకాల
పండ్లు
యాపిల్స్, అరటిపండ్లు,
నారింజ, బెర్రీస్, పీచ్,
ఆప్రికాట్ వంటి ఫ్రూట్స్ ని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటిని
ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫ్లేవర్ తగ్గిపోతుంది.
ధాన్యాలు
ధాన్యాలను
ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. వీటిని బయటపెడితేనే తాజాగా ఉంటాయి.
ఆయిల్స్
ఎలాంటి ఆయిల్
అయినా.. రూమ్ టెంపరేటచర్ లో పెట్టడమే సేఫ్.
జామ్
జామ్, జెల్లీస్
లో ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఒకవేళ
ఓపెన్ చేసినా బయటేపెట్టాలి.
మసాలాలు
మసాలా దినుసులను
ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టకూడదు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar