విటమిన్లు, ఖనిజ
లవణాలు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్ వంటివి ఎక్కువగా ఉండే ఆహార
పదార్ధాలను నిత్యం తీసుకుంటూ రోగ నిరోధక శక్తి ని పెంచుకోవడం ద్వారా కొవిడ్ లాంటి
మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనగలము...
FSSAI మార్గదర్శకాల ప్రకారం
ఏ ఏ ఆహార పదార్ధాల వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది...
>విటమిన్-డి &
విటమిన్ బి12 కొరకు ఉదయం సూర్యరశ్మి, పాలు,
పాల ఉత్పత్తులు, కొవ్వున్న చేపలు, గుడ్లు, మాంసం
>ప్రొటీన్లు కొరకు సోయా
ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు,
బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మటన్,
చేప, పాలు, పాల
ఉత్పత్తులు
>ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొరకు వాల్‌నట్స్,
గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు
విత్తనాలు, చేపలు
>విటమిన్-ఎ కొరకు
చిలగడదుంప, క్యారట్, మామిడి, బొప్పాయి, గుడ్లు, పాలకూర,
బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు వంటివి
తీసుకోవడం
>విటమిన్-ఇ కొరకు
పొద్దు తిరుగుడు, కుసుంభ, అవిసె గింజలు, బాదం, పిస్తా
>విటమిన్-బి6 కొరకు సోయాబీన్, పప్పులు, జొన్నలు,
సజ్జలు, మొక్కజొన్నలు, అల్లం,
వెల్లుల్లి, పచ్చిమిర్చి, అరటి, మునగ,
మెంతి ఆకులు, కరివేపాకు, ఉప్పుడు రవ్వ
>విటమిన్-సి కొరకు
ఆకుపచ్చని కూరగాయలు, జామ, దానిమ్మ,
ఉసిరి, ద్రాక్ష తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, క్యాప్సికమ్,
నిమ్మ
>జింకు, క్యాల్షియం, మెగ్నీషియం కొరకు అన్ని రకాల గింజ
ధాన్యాలు, పప్పు దినుసులు, సోయాబీన్,
పుచ్చకాయ విత్తనాలు, గుమ్మడికాయ విత్తనాలు,
చికెన్, గుడ్లు, వాల్‌నట్స్,
పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు
0 Komentar