Full salary for
Telangana employees and pensioners
తెలంగాణ
ఉద్యోగులు, పింఛనుదారులకు పూర్తి వేతనం
తెలంగాణలో ఉద్యోగులు, పింఛనుదారులకు ఈ నెల (జూన్) పూర్తి
వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు
ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆదాయ పరిస్థితి
మెరుగవుతున్నందున సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధుల
సంబంధించి మాత్రం ఇదివరకు అమలులో ఉన్న 75శాతం కోత విధానాన్ని మరి కొంత కాలం
కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
బాగాలేకపోవడంతో గత మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు
50% వేతనాలు మాత్రమే చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.
0 Komentar