ఉత్తరాఖండ్ కు ఇక
మూడు రాజధానులు
పరిపాలనా
రాజధానిగా డెహ్రాడూన్, జ్యుడీషియల్ కేపిటల్ గా నైనితాల్
కొనసాగుతుండగా, తాజాగా వేసవి రాజధానిగా గైర్ సైన్ కు ఆమోదముద్ర
పడింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ చమోలీ జిల్లా భరారీసైన్ (గైరె సైన్)ను వేసవి
రాజధానిగా ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ‘గైర్ సైన్’ చమోలి జిల్లాలో అత్యంత వెనుకబడిన, పర్వత పంక్తులతో
కూడిన ప్రాంతం. ఈ ఏడాది మార్చి 4న ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్
రావత్ బడ్జెట్ సమావేశాల్లో గైరె సైనన్ను వేసవి రాజధానిగా ప్రకటించారు. అంతేకాదు,
అసెంబ్లీలో తీర్మానం చేయగా, సభ ఏకపక్షంగా
ఆమోదించింది. అప్పటికే గైర్సెలో విధానసభ (శాసనసభ) భవనంతో పాటు పలు రాష్ట్ర
ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశాలు, ఒక దఫా అసెంబ్లీ సమావేశాలను సైతం గైర్ సైన్ నిర్వహించారు.
0 Komentar