Glenmark
released Favipiravir to treat COVID patients
కరోనా చికిత్సకు గ్లెన్‌మార్క్
ఔషధం విడుదల
ప్రపంచ దేశాలను
వణికిస్తున్న కోవిడ్-19 చికిత్సకు ఔషధం తయారు చేసినట్టు భారత్‌కు
చెందిన గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే మూడు దశల్లో
క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. ఫవిపిరవిర్,
ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ వైరస్ ఔషధాలపై అధ్యయనం చేసిన గ్లెన్‌మార్క్
ఫవిపిరవిర్ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో
బాధపడుతున్న వారిపై బాగా పనిచేస్తోందని వెల్లడించింది. దీనిని ‘ఫాబిఫ్లూ’ అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్లోకి విడుదల
చేయనున్నట్టు సంస్థ తెలిపింది. కరోనా లక్షణాలు స్వల్ప, మధ్య
స్థాయిలో ఉన్న డయాబెటిక్, గుండెజబ్బు వ్యాధిగ్రస్తులు కూడా
ఈ ఔషధాన్ని వాడవచ్చని తెలిపారు. ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు అవసరమైన అనుమతులను
శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి పొందినట్టు వెల్లడించింది.
వైద్యుల
ప్రిస్క్రిప్షన్ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు. అలాగే, ఒక్కో
మాత్ర ధర రూ.103గా ఉంటుందని వెల్లడించారు. కరోనా బారిన
పడినవారు 1800 ఎంజీ పరిమాణం కలిగిన మాత్రలను తొలి రోజు రెండు
సార్లు వేసుకోవాలనీ ఆ తర్వాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ పరిమాణం కలిగిన
మాత్రలను రోజుకు రెండుసార్లు చొప్పున వాడాలని సూచించారు. అయితే ఈ మందు కరోనా
రోగలక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి పనిచేయవు. పైగా తమ ఫార్మా ప్రయోగాలు, ఫలితాల తీరును అది అధికారికంగా వెల్లడించలేదు. అంటే 11 ప్రాంతాల్లో 90 మంది స్వల్ప, 60 మంది మధ్యస్థ లక్షణాలున్న రోగులపై ప్రయోగించినట్టు చెప్పింది తప్ప ఎందరు
కోలుకున్నారో చెప్పలేదు.
0 Komentar