గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమే..!
-దిల్లీ హైకోర్టుకు తెలిపిన ఆర్‌బీఐ
గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసింది. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ'పే' లేదని ఆర్‌బీఐ పేర్కొంది. నగదును ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు బదిలీ చేసే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్‌గానే పరిగణిస్తున్నట్లు చెప్పింది. జీపే ఎలాంటి చెల్లింపుల వ్యవస్థలో పాల్గొనడం లేదని, కేవలం నగదు బదిలీ చేసే థర్డ్ పార్టీ ఏజెంట్‌గానే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా ఆర్‌బీఐ తెలిపింది. అయితే గూగుల్ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ ప్రతీక్ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది.
అయితే గూగుల్ 'పే' ఆన్‌లైన్‌లో చెల్లింపుల లావాదేవీలకు వేదికని, ఇది యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐ నిబంధనలకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
0 Komentar