Government Asks
Patanjali for Details of Covid-19 'Medicine'
‘కొరోనిల్’ ఆయుర్వేద మందుపై పతంజలిని వివరణ కోరిన కేంద్రం
కొవిడ్ ఔషధ అంశంలో ఆయుర్వేద మందును కనిపెట్టినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి ప్రకటించిన కొద్ది గంటల్లోనే పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్‌ను కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ఆయుర్వేద మందును తీసుకొచ్చినట్లు పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మందుపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.
1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను.. ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారో, ఈ మందు వేటితో తయారైందో, శాంపిల్ పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ ఔషధ అనుమతి పత్రాలను అందించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది.
0 Komentar