తెలంగాణ: హెల్త్
ఎమర్జెన్సీపై ఆర్డినెన్స్ జారీ
Telangana ordinance
హెల్త్
ఎమర్జెన్సీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స ను జారీ చేసింది. ఈ
ఆర్డినెన్స్ పై గవర్నర్ తమిళిసై గెజిట్ విడుదల చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో 2005
డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం ఉద్యోగుల జీతాల్లో కోత విధించడంతో పాటు
పెన్షన్లలో ప్రభుత్వం కోత విధిస్తోంది. మార్చి 24 నుంచి ఇది
అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ,
ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు,
విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగుల
వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో గరిష్ఠంగా 50శాతం కోత విధించేలా ఆర్డినెన్స్ రూపొందించింది. కోత విధించిన మొత్తాన్ని
ఆర్నెల్లలో ఉద్యోగులు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని
పేర్కొంది.DOWNLOAD
0 Komentar