ఆరోగ్య సిబ్బందికి
సెప్టెంబరు 30 వరకు బీమాను పెంచిన కేంద్రం
ఆరోగ్య సిబ్బందికి
కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో కరోనా కేసులు పెరుగు తున్న నేపథ్యంలో
ఆరోగ్య సిబ్బందికి అందిస్తున్న రూ. 50 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమాను
మరో మూడు నెలలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాణాలకు తెగించి
కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్య
సిబ్బంది కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ ద్వారా మార్చి 30న
వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని ప్రకటించింది. ఐతే ఈ నెలాఖరుతో పథకం గడువు
ముగియనున్న నేపథ్యంలో మరో 90 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు
కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న వారికి బీమా కవచం
ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించారు. కరోనా
బాధితులకు చికిత్స అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికీ ఇది వర్తిస్తుందని
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆ తర్వాత తెలిపింది. ఈ బీమా సదుపాయం సెప్టెంబర్ వరకు
అమలులో ఉండనుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ఆర్థిక
మంత్రి నిర్మలా సీతారామన్ మార్చిలో ఈ పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా 22.12 లక్షల మందికి ఈ భీమా వర్తిస్తుంది.
0 Komentar